Site icon NTV Telugu

Kotha Malupu: సింగర్ సునీత కొడుకు రెండో సినిమా వచ్చేస్తోంది!

Akash

Akash

ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భైరవి అర్థ్యా హీరోయిన్‌గా నటిస్తున్న ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విడుదల చేశారు. ఈ చిత్రం తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటులు రఘు బాబు, పృద్వి, ప్రభావతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read :Anil Ravipudi : బ్లాక్ బస్టరిచ్చిన రావిపూడికి మెగాస్టార్ కళ్ళు చెదిరే ఆఫర్!

దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ “రొమాంటిక్ లవ్ సస్పెన్స్‌తో పాటు హాస్యరసాన్ని కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా చక్కగా కుదిరింది. వీరు బావ–మరదలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేశాం. త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతాం.” అని చెప్పారు. గ్రామీణ నేపథ్యంతో, ప్రేమ–సస్పెన్స్–కామెడీ మేళవింపుతో రూపొందుతున్న ‘కొత్త మలుపు’ ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version