“ఆర్ఆర్ఆర్” ఈరోజు వరుస అప్డేట్ లతో ప్రేక్షకుల దృష్టిని తమవైపుకు తిప్పుకునే పనిలో పడింది. సినిమా ప్రమోషన్స్ పరంగా సరికొత్త దారిలో వెళ్లే జక్కన్న ఈసారి కూడా అదే ప్రణాళికలో ఉన్నాడు. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసిన టీం ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్, పోస్టర్లు, సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు నెటిజన్లతో సరదా సంభాషణలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. మరో మూడు రోజుల్లో “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఈరోజు రెండు కొత్త పోస్టర్లను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా “కొమరం భీమ్ ఫర్ ఆర్ఆర్ఆర్” అంటూ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. అందులో ఎన్టీఆర్ రౌద్రంగా బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే ఎన్టీఆర్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల్లో ఎంత అద్భుతంగా నటించాడో బాగా అర్థమవుతుంది.
Read Also : మహేష్ ఫేవరెట్ ఫుడ్, సాంగ్స్, స్పోర్ట్స్… లిస్ట్ ఇదిగో !
ఇక సినిమాపై ఆసక్తి, అంచనాలని పెంచే “కొమరం భీమ్ ఫర్ ఆర్ఆర్ఆర్” పోస్టర్ తో ఎన్టీఆర్ అభిమానులను థ్రిల్ చేసిన “ఆర్ఆర్ఆర్” టీం ఈరోజు సాయంత్రమే మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయనుంది. సాయంత్రం 4 గంటలకు రామ్ చరణ్ పోస్టర్ విడుదల కానుంది. చరణ్ ఫ్యాన్స్ సాయంత్రం దాకా వెయిట్ చేయాల్సిందే మరి. ప్రస్తుతం సోషల్ మీడియాలో “కొమరం భీమ్ ఫర్ ఆర్ఆర్ఆర్” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్. ఇక ఇప్పటి నుంచే ఇలా పోస్టర్లతో ట్రైలర్ పై అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్.
