కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కి తమిళనాడులో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో నాని అంతటి పేరు తెచ్చుకున్న ఈ హీరో ‘డాక్టర్’, ‘డాన్’ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. ఈ మూవీస్ తో కోలీవుడ్ లో శివ కార్తికేయన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో అనుదీప్ కేవీతో ప్రిన్స్ సినిమా చేసిన శివ కార్తికేయన్ బయ్యర్స్ కి హ్యూజ్ లాస్ ని మిగిలించాడు. అంతకముందు భారి లాభాలని ఇచ్చిన హీరో, ప్రిన్స్ సినిమాతో కనీసం బ్రేక్ ఈవెన్ మార్క్ ని కూడా టచ్ చెయ్యలేకపోయాడు. దీంతో తమిళనాడులో శివ కార్తికేయన్ మార్కెట్ కి డెంట్ పడింది. దాన్ని కవర్ చెయ్యాలన్నా, ఒకప్పటిలా మళ్లీ బయ్యర్స్ తనని నమ్మలన్నా శివ కార్తికేయన్ కి ఒక సాలిడ్ హిట్ కావాలి. ఆ హిట్ ని అందుకోవడానికి శివ కార్తికేయన్ ‘మావీరన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ‘మండేలా’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ ‘మడోన్ అశ్విన్’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జులై 14న రిలీజ్ కానుంది. తెలుగులో మాహావీరుడు అనే టైటిల్ తో ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసిన మావీరన్ సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది. సరదాగా ఉండే కుర్రాడు, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథ, మదర్ సెంటిమెంట్… లాంటి ఎలిమెంట్స్ తో మావీరన్ ట్రైలర్ ఆకట్టుకుంది. శివ కార్తికేయన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంప్రెస్ చేసింది. అదితి శంకర్ ట్రైలర్ లో పెద్దగా కనిపించకపోయినా అందంగా కనిపించింది. మావీరన్ ట్రైలర్ లో కొత్తగా అనిపించిన విషయం డైరెక్టర్ ‘మిస్కిన్’ లుక్. విలన్ గా నటిస్తున్న మిస్కిన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో సూపర్బ్ ఉన్నాడు. శివ కార్తికేయన్-మిస్కిన్ మధ్య ఫేస్ ఆఫ్ మావీరన్ సినిమాని నిలబెట్టేలా ఉంది. ఎదో ఫాంటసీ పాయింట్ ని కూడా కథకి కలిపినట్లు ఉన్నాడు డైరెక్టర్ మడోన్ అశ్విన్. ఓవరాల్ గా హిట్ సినిమాకి ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ మావీరన్ ట్రైలర్ లో కనిపించాయి. మరి శివ కార్తికేయన్ మహావీరన్ సినిమాతో ఎలాంటి హిట్ ని అందుకుంటాడు అనేది చూడాలి.
