Kiara Advani: బాలీవుడ్ ఫేమస్ చాట్ షో కాఫీ విత్ కరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వల్గర్ మాటలు, శృంగారం, పనికిరాని చెత్త తప్ప ఆ షోలో ఏమి ఉండదని ప్రేక్షకులు ఏకిపారేస్తున్న విషయం విదితమే. అయినా కరణ్ లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. అవే చెత్త ప్రశ్నలు.. తారల శృంగారపు అలవాట్ల గురించి కరణ్ అడగడం, వారు కొద్దిగా ఇబ్బందిపడి ఏదో ఒకటి చెప్పడం జరుగుతూనే ఉన్తయి. తాజాగా మరో హీరోయిన్ ఇలాంటి ఇబ్బందికే గురి అయ్యింది. ఇటీవల ఈ షోకు కబీర్ సింగ్ జంట కియారా అద్వానీ, వరుణ్ ధావన్ పాల్గొని రచ్చ చేశారు. ఇక అందరిలాగానే వీరిని కూడా కరణ్ శృంగారానికి సంబంధించిన ప్రశ్నలు అడిగాడు.
“నువ్వు బెడ్ రూమ్ లో దొంగా పోలీస్ ఆటలు ఆడలేదా..? అని కియారా ను అడిగేశాడు. దానికి ఆమె ఈ షోను ఇంట్లో అమ్మ చూస్తూ ఉంటుంది అని చెప్పగా.. కరణ్.. చూడనివ్వండి ఇప్పటివరకు నువ్వు ఇంకా కన్యవనే(వర్జిన్) అనుకొంటుందా..? అని అడిగేశాడు. ఇక దానికి ఇబ్బంది పడిన కియారా.. కచ్చితంగా నేను కన్యననే అనుకుంటున్నాను అని బదులు ఇచ్చింది. ఇక సిద్దార్థ్ మల్హోత్రా తో ప్రేమాయణం గురించి మాట్లాడుతూ సిద్దార్థ్ తో నువ్వు రిలేషన్ లో ఉన్నావా..? అని అడుగగా.. అవును అని చెప్పలేను, కాదు అని చెప్పలేను. మా ఇద్దరి మధ్య స్నేహం కన్నా ఎక్కువ సంబంధం ఉంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఏఐసోడె నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో పలు సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.
