NTV Telugu Site icon

KA10 : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ టీజర్ రిలీజ్..హిట్ కళ కనిపిస్తోంది

Dilruba

Dilruba

ఈ దీపావళికి “క” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా ‘దిల్ రూబా’ ని ప్రకటించాడు కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

కిరణ్ అబ్బవరం రీసెంట్ మూవీ “క” సూపర్ హిట్ తర్వాత వస్తుండడంతో ‘దిల్ రూబా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ ను నేడు రిలీజ్ చేసారు మేకర్స్. ప్రేమలో ఫెయిల్ అయిన ఓ కాలేజ్ కుర్రాడికి మరో అమ్మాయితో ప్రేమలో ఎందుకు పడాల్సివచ్చింది అనే పాయింట్ ను ట్రైలర్ లో చూపించారు. ప్రేమ చాలా గొప్పది కానీ అది ఇచ్చే భాద చాలా భయంకరంగా ఉంటుంది వంటి డైలాగ్ లు ఆకట్టుకునన్నాయి. ఈ ట్రైలర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్యామ్ సీఎస్ అందించిన నేపధ్య సంగీతం అద్భుతంగా ఉంది. ఇక కిరణ్ అబ్బవరం సరసన నటించిన హీరోయిన్ రుక్సాన్ థిల్లర్ కు ఇంపార్టెంట్ రోల్ ఉన్నట్టు కన్పిస్తోంది. కిరణ్ అబ్బవరం మెకానికల్ స్టూడెంట్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Also Read : MadhaGajaRaja : 12 ఏళ్ళ తర్వాత రిలీజ్ అవుతున్న విశాల్ సినిమా

Show comments