Site icon NTV Telugu

Kiran Abbavaram: సలార్ డేట్ కి వస్తున్న రంజన్… ట్రైలర్ ని దించాడు

Kiran Abbavaram

Kiran Abbavaram

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాయలసీమ యాసలో మాట్లాడుతూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న కిరణ్ సబ్బవరం, రీసెంట్ గా వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా ప్రమోషన్స్ ని అగ్రెసివ్ గా చేసే పనిలో ఉన్నాడు. ఎ. ఎం. రత్నం సమర్పణలో నిర్మితమౌతున్న ‘రూల్స్ రంజన్’ అనే సినిమాలో కిరణ్ అబ్బవరం చేసాడు. ‘డి. జె. టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను ఎ. ఎం. రత్నం తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతవరకు మాస్ సినిమాలే ఎక్కువగా చేసిన కిరణ్ అబ్బవరం, మొదటిసారి కాస్త క్లాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఉన్నాడు. గతంలో రిలీజ్ అయిన సమ్మోహనుడా సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

అమ్రేష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ‘సమ్మోహనుడా’ సాంగ్ సూపర్ బజ్ జనరేట్ చేసింది. నిన్న మొన్నటివరకూ రిలీజ్ డేట్ డైలమాలో ఉన్న ఈ మూవీ… సలార్ వాయిదా పడడంతో ఆ డేట్ కి రిలీజ్ అవడానికి రెడీ అయ్యింది. సెప్టెంబర్ 28న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి మేకర్స్ రూల్స్ రంజన్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో ఫన్ బాగా వర్కౌట్ అయ్యింది. కిరణ్ అబ్బవరం స్ట్రిక్ట్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, జాలీగా ఉండే అబ్బాయిగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించినట్లు ఉన్నాడు. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్షా మంచి కామెడీ చేసినట్లు ఉన్నారు. ట్రైలర్ తో కిరణ్ అబ్బవరం పాజిటివ్ బజ్ నే రాబట్టాడు. మరి సెప్టెంబర్ 28న థియేటర్స్ లో ఏమవుతుంది అనేది చూడాలి.

Exit mobile version