టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. వరుస ఫ్లోప్స్ తో రేస్ లో వెనకబడిన విజయ్ కింగ్డమ్ తో భారీ హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అందుకు తగ్గట్టే లుక్ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో విజయ్ మాస్ పర్ఫామెన్స్ కు రెస్పాన్స్ అదిరిపోయింది.
Also Read : Mohan lal : లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను స్టార్ట్ చేసిన స్టార్ హీరో కొడుకు
ప్రస్తుతం చివరిదశ షూటింగ్ లో ఉన్న కింగ్‌డమ్ మే 30న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ఇదే వరకే ప్రకటించారు. కానీ అనుకున్న టైంకి ప్రొడక్ట్ రెడీ కాలేదట. అందుకే వాయిదా వేసుకుంటున్నారు. కొత్త రిలీజ్ డేట్ కి OTT సంస్థ తో డిస్కషన్ నడుస్తుంది. అలాగే ఇండస్ట్రీలో ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ గురించి మీటింగ్స్ జరుగుతున్నాయి. పర్సంటేజ్ వ్యవహారం మీద అది కూడా తేలాల్సి ఉంది. అది తేలాక మరో డేట్ ను రిలిజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జూన్ లో రిలీజ్ చేద్దాం అనుకుంటే అక్కడ హరిహర వీరమల్లు ఉండడంతో జులైలో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ రోజు డిస్కషన్స్ జరుగుతున్నాయి రిలీజ్ డేట్ పై క్లారిటీ రావచ్చని తెలుస్తోంది. కానీ ఎప్పుడు వచ్చిన విజయ్ దేవరకొండ ఈ సారి టార్గెట్ మిస్ అవడు అని టాలీవుడ్ సిర్కిల్స్ లో వినిపిస్తోంది.
