Site icon NTV Telugu

Kavya Thapar: ఈగల్ లో రొమాన్స్ కొత్తగా ఉంటుంది..చాలా ఎంజాయ్ చేస్తారు!

Kavya Thapar Interview

Kavya Thapar Interview

Kavya Thapar Interview for Eagle movie: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ కావ్య థాపర్ ‘ఈగల్’ విశేషాలు మీడియా సమావేశంలో పంచుకున్నారు.

‘ఈగల్’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?
ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్న సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈగల్ కథ చెప్పారు. చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించి తప్పకుండా సినిమా చేయాలని అనుకున్నాను. అన్నిటికంటే రవితేజ సినిమా చేయడం గొప్ప అవకాశం. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఎంపిక చేశారు. ఈగల్ లో యాక్షన్, రొమాన్స్ వేటికవే చాలా యూనిక్ గా వుంటాయి. రొమాన్స్ అయితే చాలా డిఫరెంట్ గా, కొత్తగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

ఈగల్ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
ఇందులో నా పాత్ర పేరు రచన. జీవితంలో చాలా యునిక్ గోల్స్ వున్న అమ్మాయిగా కనిపిస్తా, ఇందులో చాలా అద్భుతమైన ప్రేమ కథ వుంది. దాని గురించి ఇప్పుడు ఎక్కువ రివిల్ చేయకూడదు. రవితేజ, నా పాత్రల మధ్య కెమిస్ట్రీ చాలా యూనిక్ గా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది, ఈగల్ పై రవితేజ, డైరెక్టర్ కార్తీక్, మా టీం అంతా చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈగల్ తప్పకుండా ప్రేక్షకులను చాలా గొప్పగా అలరిస్తుంది.

రవితేజతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
రవితేజతో సినిమా చేయడం నా అదృష్టం. రవితేజ వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని. ఆయన చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. సెట్స్ లో చాలా సరదాగా, సపోర్ట్ గా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం మరిచిపోలేని అనుభూతి.

ఈగల్ విషయంలో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ?
రచయిత మణి ”అద్భుతంగా నటించారు. తెరపై కావ్య కాకుండా రచన కనిపించింది’ అన్నారు. రచయిత నుంచి ఈ ప్రశంస రావడం చాలా తృప్తినిచ్చింది. నా వరకు పాత్రకు వంద శాతం న్యాయం చేశాననే నమ్ముతున్నాను.

ఈగల్ జర్నీ ఎలా సాగింది ?
ఈగల్ బ్యూటీఫుల్ జర్నీ. పోలాండ్, లండన్ ఇలా అద్భుతమైన ఫారిన్ లొకేషన్స్ లో ఇంటర్ నేషనల్ లెవెల్ లో షూట్ చేశారు. నిజంగా ఒక వెకేషన్ లాగానే అనిపించి చాలా ఎంజాయ్ చేశాను.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా, సినిమాని ఇంటర్నేషనల్ గా చాలా గ్రాండ్ గా చిత్రీకరించారు. వారితో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా.

కోవిడ్ టైం మీ కెరీర్ పై ప్రభావం చూపించిందా?
కోవిడ్ కారణంగా దాదాపు అందరికీ ఒక బ్రేక్ టైం వచ్చింది. అయితే ఈ సమయంలో ఎక్ మినీ కథ, ఫర్జి వెబ్ సిరీస్ చేశాను. అలాగే ఇంట్లో ఉండటం, ఇంటి భోజనం తినడం, ఫ్యామిలీతో సమయాన్ని గడపడం, తోచిన సాయం చేయడం ఇవన్నీ కూడా చేసే అవకాశం ఆ సమయం కల్పించింది.

మీకు ఎలాంటి సినిమాలు చేయాలని వుంది ?
ఫుల్ మాస్ యాక్షన్ సినిమా చేయాలని వుంది(నవ్వుతూ). అలాగే సూపర్ నేచురల్ సినిమాలు చేయాలని వుంది.

Exit mobile version