karthikeya about Bedurulanka 2012: యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ‘బెదురు లంక 2012’ సినిమాను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 25న) సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో కార్తికేయ ముచ్చటించగా ఈ క్రమంలో ఆ విషయం గురించి కీలక విశేషాలు పంచుకున్నారు. 2012లో కార్తికేయకు, ఇప్పుడు 2023లో కార్తికేయకు మీరు గమనించిన మార్పు ఏమిటి? అని అడిగితే మెచ్యూరిటీ పెరిగిందని, అప్పుడు జీవితం అంతా తెలుసు అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఏమీ తెలియదని అర్థమైందని, అప్పట్లో చేష్టలు పిల్లల తరహాలో ఉండేవి, కానీ ఇప్పుడు కాస్త పద్ధతిగా ఉంటున్నానని అన్నారు. ‘బెదురులంక 2012’ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది? ఆ కథ ఏమిటి? అని అడిగితే అజయ్ భూపతి ద్వారా దర్శకుడు క్లాక్స్ నాకు పరిచయం అయ్యారని, రామ్ గోపాల్ వర్మ దగ్గర వాళ్ళిద్దరూ కొలీగ్స్.
Vaishnavi Chaitanya: బేబీ.. ఇద్దరబ్బాయిలను మోసం చేసినా.. ఈ విషయంలో నువ్వు తోపు అంతే
కరోనా సమయంలో నాకు క్లాక్స్ కథ చెప్పాడఇన్ అన్నారు. ఆ సమయంలో ప్రపంచం అంతం అయిపోతుంది అన్నట్లు ప్రచారం జరిగింది కదా, అందుకే కథకు బాగా కనెక్ట్ అయ్యానని అన్నారు. ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది, కథలో కొత్తదనం, వినోదం ఉండటంతో ఓకే చేశానని అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’లో మీ క్యారెక్టర్ శివ, గోదావరి నేపథ్యంలో కథ! ‘బెదురులంక 2012’లోనూ మీ పేరు శివ, ఇదీ గోదావరి నేపథ్యంలో తీసిన సినిమా! సెంటిమెంట్ అనుకోవచ్చా? అని అడిగితే అది యాదృశ్చికంగా జరిగిందని అన్నారు. కథ నచ్చి రెండు సినిమాలు చేశానని, క్యారెక్టర్ పేరు శివ అని చెప్పినప్పుడు క్లాక్స్ తో అనలేదు కానీ చాలా రోజుల తర్వాత అతనికి గుర్తు చేశానని అన్నారు. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి ఈ సినిమా కూడా హిట్ అయితే హ్యాపీ. హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాంమని ఆయన అన్నారు.
