Site icon NTV Telugu

Japan: ‘జపాన్’ దిగుతున్నాడు.. ‘పెద్దమ్మ’ను దింపుతున్నాడు

Japan Teaser

Japan Teaser

Karthi Dream Warrior Pictures Japan Teaser: వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ‘జపాన్’ అనే సినిమా చేస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ టీజర్ ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఆ టీజర్ అంతా ఆసక్తికరంగా సాగింది. హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒకడు కన్నమేసి రెండు వందల కోట్ల విలువ చేసే నగలు ఎత్తుకు పోతే మీ లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది ? ఈ దొంగతనం స్టైల్ చూస్తే జపాన్ ది లాగే అనిపిస్తుంది, ఇండియా అంతటా జపాన్ పై 182 కేసులు వున్నాయి. నాలుగు రాష్ట్రాల పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు.

Leo Movie: ‘లియో’ లైన్ క్లియర్.. ఇక ‘కేసరి’తో ఢీకొట్టడమే లేటు!

కానీ ఒక్కసారి కూడా వాడు ఎవరికీ దొరకలేదు అంటూ జపాన్ రేంజే వేరు అమ్మాయిలు, గోల్డ్ తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా అంటూ వేర్వేరు పాత్రలు జపాన్ కోసం చెప్పే వాయిస్ ఓవర్ లో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ టీజర్ లో అడ్వెంచరస్ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కార్తి డిఫరెంట్ గెటప్స్ నెక్స్ట్ లెవల్ లో కనిపిస్తున్నాయి. చివర్లో ‘ఎన్ని బాంబులు వేసిన ఈ జపాన్ ఎవరూ ఏం పీకలేర్రా” అని కార్తీ చెప్పిన డైలాగ్, వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఇక ఈ క్రమంలో పెద్దమ్మగా ఫేమస్ అయిన గన్ ను కూడా కార్తి వాడడం హాట్ టాపిక్ అవుతోంది. అలాగే టీజర్ లో సునీల్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. టీజర్ కు జివి ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్యం సంగీతం బ్రిలియంట్ గా అనిపిస్తోంది. ఈ టీజర్ సినిమాపై మరింతగా అంచనాలను పెంచింది, ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ దీపావళికి జపాన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది.

Exit mobile version