Karthi: కార్తి ‘జపాన్’లో ఏం చేయబోతున్నాడు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthi: ‘పొన్నియిన్ సెల్వన్’లో వందియదేవన్ గా మెప్పించిన కార్తి త్వరలోనే ‘జపాన్’తో జనం ముందుకు రాబోతున్నారు. తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మెప్పించడంలో ఇప్పటికే పలుమార్లు మేటిగా నిలిచారు కార్తి. కొన్నిసార్లు కార్తి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేసి ఉండవచ్చు. అయితే నటునిగా మాత్రం కార్తి సదా మెప్పిస్తూనే ఉండడం విశేషం! తమిళనాట స్టార్ గా సాగుతున్న తన అన్న సూర్య కన్నా మిన్నగా తెలుగునాట ఆదరణ చూరగొన్నారు కార్తి.
తన తండ్రి శివకుమార్ తమిళనాట స్టార్ గా ఉన్న రోజుల నుంచీ సినిమా వాతావరణం కార్తికి సుపరిచితమే! అయితే కార్తి మాత్రం దర్శకునిగా మెగాఫోన్ పట్టి జనం మెచ్చే చిత్రాలు రూపొందించాలని ఆశించారు. నటునిగానూ అలరించాలనీ తలచారు. అయితే ‘యువ’ చిత్రంలో సూర్య నటిస్తున్నప్పుడు అతనికి ఓ తమ్ముడు ఉన్నాడని దర్శకుడు మణిరత్నం కార్తిని పిలిపించారు. అప్పట్లో బొద్దుగా ఉన్న కార్తిని చూసి, ముందుగా అనుకున్న పాత్రకు కాదని వేరే బిట్ రోల్ లో నటింపచేశారు. ఆ సినిమాకు కార్తి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్టు కార్తి అనుకోకుండా ‘పరుత్త వీరన్’తో నటుడయ్యారు. ఆపై ‘ఆయిరత్తిల్ ఒరువన్’లో నటించి మంచి పేరు సంపాదించారు. ఈ సినిమా తెలుగులో ‘యుగానికొక్కడు’గా అనువాదమై అలరించింది. వెంటనే లింగుసామి దర్శకత్వంలో కార్తి, తమన్నాతో కలసి నటించిన ‘పయ్యా’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో ‘ఆవారా’గా విడుదలై విజయాన్ని మూటకట్టుకుంది. అప్పటి నుంచీ తాను తమిళంలో నటించిన చిత్రాలను తెలుగులోనూ డబ్ చేస్తూ వచ్చారు. దాంతో సూర్య కంటే కార్తినే తెలుగువారికి దగ్గరయ్యారు.
Also Read
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
- Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
- 'జైలర్ 2' సెన్సార్ రగడ. 'U/A' సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
‘ఊపిరి’లో నాగార్జునతో కలసి నటించారు కార్తి. ఆ సినిమాలోనూ నటునిగా మంచి మార్కులే సంపాదించారు. కార్తి నటించిన ‘ఖైదీ, సుల్తాన్’ సైతం తెలుగువారిని భలేగా అలరించాయి. ఈ నేపథ్యంలో కార్తితో డైరెక్ట్ గా ఓ తెలుగు సినిమా తీయాలని కొందరు నిర్మాతలు భావించారు. అది ఎలా ఉన్నా మణిరత్నం మేగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాల్లోనూ కార్తి చలాకీగా నటించి, తెలుగువారిని ఆ సినిమా చూసేలా చేశారు. తమిళనాట మంచి విజయం సాధించిన ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం, తెలుగులో అంతగా అలరించలేకపోయింది. కొందరైనా ప్రేక్షకులు ఆ సినిమాను తెలుగులో చూశారంటే అది కార్తి వల్లే అని చాలామంది అన్నారు. ఏది ఏమైనా ఈ సారి ఓ సాలిడ్ హిట్ పట్టేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు కార్తి. మరి రాబోయే ‘జపాన్’తో కార్తి ఏ తీరున అలరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!