Site icon NTV Telugu

Commitment: బూతు డైలాగ్స్ తో కమిట్ అవుదామంటున్న తెలుగమ్మాయి.. కేసు నమోదు

Commitments

Commitments

Commitment: అచ్చతెలుగు అమ్మాయి తేజస్విని మదివాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ఆరంభించిన ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక బిగ్ బాస్ రియాలిటీ షో లో హంగామా చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా నటిస్తున్న చిత్రం కమిట్మెంట్. ‘హైదరాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శాలకు దారితీసింది. ట్రైలర్ మొత్తం బూతు డైలాగులు, శృంగారం, మితిమీరిన హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ తో నింపేశారు. ఇక చివర్లో భగవద్గీత శ్లోకం ‘మురికి చేత అద్దము.. మావిచేత శిశువు యెట్లు కప్పబడునో.. అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి యున్నది’ అని చెప్పి సినిమాలో ఏదో ఉన్నట్లు చూపించారు.

ఇక తాజాగా ఈ శ్లోకంపై హిందూ సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎలాంటి సినిమాలో ఎలాంటి శ్లోకాన్ని చూపిస్తున్నారు. ఇది హిందువులను అవమానించడమే అంటూ మండిపడుతున్నారు. వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం ఈ సినిమాను నిలిపివేయాలంటూ కరాటే కళ్యాణి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన కరాటే కల్యాణి మాట్లాడుతూ “హిందువులు పూజించే భగవద్గీత శ్లోకాలను అసభ్యకరంగా చిత్రీకరణ చేశారు. కమిట్మెంట్ సినిమా ట్రైలర్ లో శ్లోకాలతో అశ్లీల సన్నివేశాలు రూపొందించారు. సినిమా నిర్మాత, డైరెక్టర్ ల పై చర్యలు తీసుకొని.. సినిమాను నిలిపివేయాలి, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ” చెప్పుకొచ్చింది. కరాటే కళ్యాణి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. మరి ఈ వివాదంపై కమిట్మెంట్ చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version