Site icon NTV Telugu

Karan Johar: సెల్ఫ్ బుకింగులతో సినిమా హిట్ అవదు.. బుక్ మై షో బండారం బయట పెట్టిన కరణ్

Karanjohar

Karanjohar

సినిమా రిలీజ్ కాగానే ప్రేక్షకులు ఆన్లైన్‌లో టికెట్లు బుక్ చేయడం సాధారణమే. అయితే, బుక్ మై షో లాంటి ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేస్తే ముందే కొన్న వరుసల సీట్లు “సోల్డ్ ఔట్” అని కనిపిస్తాయి. కానీ ఆ సీట్లు వాస్తవానికి అమ్ముడుపోకుండా, నిర్మాతలు లేదా హీరోలు ముందుగానే కార్పొరేట్ బుకింగ్స్ పేరుతో బుక్ చేసుకుంటార‌ట.

Also Read: Sreeleela : సౌత్ క్యూటీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ ప్రాజెక్ట్‌లో శ్రీలీల

ఈ విధంగా హైప్ క్రియేట్ చేసి, సినిమా చాలా బాగా నడుస్తోందనే ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఇది ఒక ట్రిక్. కానీ, ఒక సినిమా బాగుందా? లేదో తేల్చేది ప్రేక్షుల మౌత్ టాక్ మాత్రమే. థియేటర్‌ నుంచి బయటికి వచ్చినవారు యూట్యూబ్ రివ్యూల్లోనూ, తమ స్నేహితులకు, పొరుగు వారికి నిజాయితీగా చెప్పేస్తారు. కాబట్టి ఇలాంటి సెల్ఫ్ బుకింగ్స్‌తో ప్రజలను మోసం చేయడం వృథా ప్రయత్నం. అయితే ఇదే విషయం పై బాలీవుడ్ అగ్ర దర్శక–నిర్మాత కరణ్ జోహార్ కూడా బహిరంగంగా స్పందించారు.. “కార్పొరేట్ బుకింగ్స్, సెల్ఫ్ బుకింగ్స్ అనేవి ఇండస్ట్రీలో ఉన్న చెత్త పద్ధతులు. వీటితో సినిమా హిట్ కాదని, తాత్కాలికంగా టికెట్ సేల్స్ పెరిగిన, ఇవి సినిమాకు నష్టంలో పడేస్తాయి” అని ఆయన హెచ్చరించారు.

కరణ్ ఇంకా మాట్లాడుతూ “నిర్మాతలు తమ సొంత డబ్బు పెట్టి టికెట్ కొనడం వృధా పని. ఇలా చేయడం వల్ల పరిశ్రమ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది” అని విమర్శించారు. మొత్తం మీద, ఒక సినిమా విజయవంతం కావాలంటే కంటెంట్ బాగుండాలి. సినిమా బాగుంటే ప్రేక్షకులు స్వయంగా ఆదరిస్తారు. బాగోలేకపోతే ఎన్ని జిమ్మిక్స్ చేసినా లాభం ఉండదని కరణ్ జోహార్ స్పష్టం చేశారు.

Exit mobile version