Karnataka : కర్ణాటకలో భాషా చిచ్చు రాజుకుంది. మరోసారి మరాఠా వర్సెస్ కన్నడ వివాదం తెరమీదకు వచ్చింది. గత నెల బెలగావీలో కేఎస్ ఆర్టీసీ బస్సు కండక్టర్ మరాఠాలో మాట్లాడలేదని.. మరాఠీ అనుకూలవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాడిని నిరసిస్తూ 22న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల దాకా రాష్ట్రం మొత్తం స్తంభింపజేస్తామని కన్నడ సంఘాలు తెలిపాయి. కన్నడ భాషను కాపాడుకోవాలని.. దీనికి అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సహకరించాలని కోరాయి. దీంతో కన్నడ వర్సెస్ మరాఠా వివాదం రాజుకున్నట్టు అయింది.
Read Also : Posani Krishna Murali: పోసానికి బిగ్ రిలీఫ్.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే..?
ఇక కన్నడ సంఘాల నిరసనకు కేఎస్ ఆర్టీసీతో పాటు బెంగుళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అటు ఊబెర్, ఓలా, ఆటో రిక్షా, క్యాబ్ యూనియన్లు కూడా మద్దతు తెలిపాయి. దీంతో రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో తమకు ఇబ్బందులు తలెత్తుతాయని విద్యార్థులకు ఆందోళన చెందుతున్నారు. మరి ఎగ్జామ్స్ వాయిదా వేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు భాషా వివాదాలు చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. తమిళనాడు ఇప్పటికే హిందీని వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమమే చేస్తోంది. ఇలాంటి టైమ్ లో కర్ణాటకలో ఈ చిచ్చు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.