Site icon NTV Telugu

Kangana: దేశ ప్రజలపైనే యుద్ధం ప్రకటించిన ప్రధాన మంత్రి కథ

Kangana

Kangana

కంగనా రనౌత్ అనే పేరు వినగానే ఒకప్పుడు మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్, హయ్యెస్ట్ పైడ్ హీరోయిన్ గుర్తొచ్చేది. ఎలాంటి క్యారెక్టర్ ని అయినా బ్యూటిఫుల్ గా ప్లే చేసే పవర్ ఫుల్ హీరోయిన్ గా కంగనా పేరు తెచ్చుకుంది. అంతటి హీరోయిన్ గత కొంతకాలంగా కంగనా తన స్థాయి సినిమా చెయ్యట్లేదు అనే ఫీలింగ్ లో అభిమానులు ఉన్నారు. ఆ లోటుని తీర్చెయ్యడానికి కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతుంది. కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమాలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, నిర్మాత, దర్శకత్వం బాధ్యతలు కూడా కంగనా నిర్వహిస్తూ ఉండడం విశేషం. ఇందులో 1975 నాటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కంగనా రనౌత్ చిత్రాలలో ‘ఎమర్జెన్సీ’ నటిగా తనకు ఓ ఛాలెంజ్ అని ఆమె అన్నారు. అంతేకాదు, ఆమె దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి కలుగుతోంది.

అయితే కంగనా రనౌత్ బీజీపీ వైపు నిలుస్తుంది కాబట్టి ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరాగాంధీని నెగటివ్ షేడ్స్ లోనే చూపిస్తారని జనం అంటున్నారు. ఫిల్మ్ మేకర్స్ గా కంగనా ఎలాంటి స్టాండ్ తీసుకోని ఎమర్జెన్సీ సినిమా చేసింది అనే విషయం తెలియాలి అంటే నవంబర్ 24 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. ఎందుకంటే ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ అవ్వబోయేది ఆ రోజే. నవంబర్ 24న ఎమర్జెన్సీ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు కంగనా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఒక వీడియోని కూడా రిలీజ్ చేసారు, ఇందులో ఇందిర గెటప్ లో కంగనా రనౌత్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించారు. మరి, తనదైన అభినయంతో ఆమె ఏ తీరున ‘ఎమర్జెన్సీ’లో అలరిస్తారో చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కంగన బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తూ తెరకెక్కిస్తోన్న ‘ఎమర్జెన్సీ’ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version