NTV Telugu Site icon

Kangana Ranaut: డెంగ్యూ వచ్చినా ఆ పని ఆపని కంగనా.. మరీ అంత పిచ్చి ఏంటి

Kangana

Kangana

Kangana Ranaut:ఒక సినిమా కోసం హీరో హీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. వారి ఆరోగ్యాలను పణంగా పెట్టి మరీ సినిమాను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు సెట్ లో గాయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమా కోసం ఎంత కష్టపడుతోంది అనేది అందరికి తెల్సిన విషయమే. తాజాగా మరోసారి అది ఋజువయ్యింది. ఆమె ఆరోగ్యం బాగోలేకపోయినా నిర్మాతకు నష్టం రాకూడదని సెట్ లో అడుగుపెట్టి షూటింగ్ ను పూర్తిచేసింది. ప్రస్తుతం కంగనా ఇందిరా గాంధీ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఎమెర్జెన్సీ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఆమె దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోంది.

ఇక సోమవారం కంగనా డెంగ్యూ బారిన పడినట్లు తెలుస్తోంది. హెవీ ఫీవర్ తో బాధపడుతున్నా లెక్కచేయకుండా ఆమె సెట్స్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. డెంగ్యూ ను కూడా పట్టించుకోకుండా షూటింగ్ ను కంటిన్యూ చేసినట్లు మణికర్ణిక ఫిలిమ్స్ తమ ఇన్స్టాగ్రామ్ లో తెలిపింది. “డెంగ్యూ వచ్చి తెల్ల రక్త కణాలు తగ్గిపోయి, జ్వరంతో ఒళ్లంతా కాలిపోతున్న షూటింగ్ ను ఆపకుండా వచ్చి పనిచేస్తున్నారు. కంగనా దీన్ని ఫ్యాషన్ అనరు .. పిచ్చి అంటారు. నిజంగా చాలామందికి మీరు స్ఫూర్తిదాయకం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక కంగనాకు డెంగ్యూ అని తెలుసుకున్న ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని కామెంట్స్ పెడుతున్నారు.