NTV Telugu Site icon

Kangana Ranaut: ‘ఎమర్జెన్సీ’ మూవీ స్పెషల్ షో.. కంగనను ప్రశంసించిన కేంద్ర మంత్రి

Kangana

Kangana

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా తెరక్కెక్కిన ఈ మూవీలో అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఈ జనవరి 17న విడుదల కానుంది. అయితే తాజాగా నాగ్‌పూర్‌లో ‘ఎమర్జెన్సీ’ స్పెషల్ షోను ప్రదర్శించారు. వీక్షించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నటుడు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్‌ తో పాటుగా, ఎమర్జెన్సీ టైమ్‌లో  జైలు శిక్ష అనుభవించిన అప్పటి కార్మికులందరిని  ఆహ్యానించారు. 

ఇందులో భాగంగా సినిమా చూసిన నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..‘ సినిమా మొదటిసారి చూస్తున్నాను. ఈ ఎమర్జెన్సీ టైమ్‌ కష్టాలు ఎదుర్కొన్న కొంతమందిని నేను పిలిచాను.మన దేశ చరిత్రలో చీకటి అధ్యాయానికి ఇంత ప్రామాణికతతో అందించినందుకు చిత్ర నిర్మాతలు, నటీనటులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. 

కంగనా మాట్లాడుతూ.. ‘మా సినిమా మొదటి షో ఇది. నితిన్ జి తో నాకు మంచి అనుబంధం ఉంది. నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆయననే సహాయం అడుగుతాను. ఎమర్జెన్సీ టైమ్‌లో పరిస్థితులపై ఈ సినిమా తీశాం. సెన్సార్ చాలా పరిశీలన చేసింది, చరిత్రకారులను నియమించి.. ప్రతి ఒక సీన్ ను క్షుణంగా పరిశీలించింది. దీంతో మేము వాటికి ఆధారాలు ఇవ్వాల్సి వచ్చింది. అలా 6 నెలల పోరాటం తర్వాత థియేటర్స్‌లోకి వస్తోంది’ అని తెలిపింది. మరి మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

 

 

Show comments