రష్యన్ మోడల్, ‘కాంచన 3’ మూవీ నటి అలెగ్జాండ్రా జావి ఆత్మహత్య చేసుకుంది. గోవాలో తను నివసిస్తున్న అపార్టుమెంటులోనే ఆకస్మాత్తుగా మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె నిజంగా ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా ఆమెను చంపారా? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే, ఆమె సన్నిహితులు ప్రకారం.. అలెగ్జాండ్రా జావి ప్రేమలో విఫలమైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆమె తన ప్రియుడితో గొడవపడి విడిపోయినట్లు సమాచారం. ఆ కారణంతోనే ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. మరోవైపు ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా.. అనే కోణంలోను గోవా పోలీసులు విచారణ చేపడుతున్నారు.
జావి ‘కాంచన 3’ సినిమాలో రాఘవ లారెన్స్ తో కలిసి నటించింది. ప్రతీకారం తీర్చుకునే దెయ్యం పాత్రలో అలెగ్జాండ్రా జావి తన నటనతో మెప్పించింది.
‘కాంచన 3’ హీరోయిన్ మృతిపై అనుమానాలు
