Site icon NTV Telugu

Kamal Haasan: కల్ట్ కాంబినేషన్ నుంచి టీజర్ వస్తుంది…

Kamal

Kamal

నాయకుడు… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైమ్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న సినిమా. ఇండియా లోనే కాదు వరల్డ్ వైడ్ ఎన్నో ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ లో ఇప్పటికీ క్లాసులు చెప్పడానికి నాయకుడు సినిమాని ఒక కేస్ స్టడీగా ఉపయోగిస్తారు. నాయకుడు కథా కథనాలు ఎన్నో కమర్షియల్ సినిమాలకి ఒక దిక్సూచిగా నిలిచాయి. లోకనాయకుడు కమల్ హాసన్ అండ్ మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి ఇండియన్ మూవీ లవర్స్ కి చేసిన మహాద్భుతం నాయకుడు. ఇళయరాజా మ్యూజిక్, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నాయకుడు సినిమాకి ప్రాణం పోశాయి. 1987లో రిలీజ్ అయిన ఈ మూవీని టిల్ డేట్ ఆడియన్స్ చూస్తూనే ఉంటారు. మణిరత్నం తన మూవీ మేకింగ్ టాలెంట్ ని చూపిస్తే… కమల్ హాసన్ ఇలాంటి నటుడు అసలు ఇంకొకడు పుడతాడా అనిపించే రేంజులో పెర్ఫార్మెన్స్ చేసాడు.

ఒక గ్యాంగ్ స్టర్ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ఉండడం అనేది చాలా అరుదు కానీ నాయకుడు సెకండ్ హాఫ్ మొత్తం ఇదే ఎమోషన్ పైన సాగుతుంది. హాలీవుడ్ గాడ్ ఫాదర్ ఇన్స్పిరేషన్ తో తెరకెక్కిన నాయకుడు సినిమా తర్వాత మణిరత్నం, కమల్ మళ్లీ కలిసి పని చేయలేదు. ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి వర్క్ చేస్తే చూడాలని మూవీ లవర్స్ అంతా వెయిట్ చేసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తే కమల్ హాసన్-మణిరత్నంలు ఇటీవలే #KH234 సినిమాని అనౌన్స్ చేసారు. ఇండియన్ 2తో పాటు సైమల్టేనియస్ గా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇందుకు కారణం KH 234 టీజర్ రిలీజ్ డేట్ లాక్ అవ్వడమే. ప్రస్తుతం కోలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం మేరకు కమల్-మణిరత్నం సినిమా నుంచి నవంబర్ 7న టీజర్ బయటకి రాబోతోంది. కమల్ హాసన్ పుట్టిన రోజు కావడంతో టీజర్ ని లాంచ్ చేసి KH 234 ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. మరి కమల్-మణిరత్నం కలిసి మరో నాయకుడు సినిమాని ఇస్తారేమో చూడాలి.

Exit mobile version