Site icon NTV Telugu

Kalyan Ram: డెవిల్ డిలే… ఆ పని ఇంకా అవ్వలేదు

Devil Movie Sets

Devil Movie Sets

బింబిసార సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘డెవిల్’ సినిమాలో కళ్యాణ్ రామ్ ‘బ్రిటిష్ స్పై’గా నటిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న ఈ మూవీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది. డెవిల్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన డైరెక్టర్ నవీన్ మేడారం ఇప్పుడు డెవిల్ సినిమాతో అసోసియేట్ అయ్యి లేడు. డైరెక్టర్ ప్లేస్ లో నిర్మాత అభిషేక్ నామానే ఉన్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో, థ్రిల్లింగ్ స్పై జానర్ లో సినిమా అంటే పాన్ ఇండియా ఆడియన్స్ కి రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు.

ఈ కారణంగానే మేకర్స్ డెవిల్ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. బీ4యూ మోషన్ పిక్చర్స్ డెవిల్ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తున్నారు. బింబిసారా సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయాల్సిన కళ్యాణ్ రామ్, ఈ నవంబర్ 24న అయినా పాన్ ఇండియా హిట్ కొడతాడు అనుకుంటే నందమూరి అభిమానులకి షాక్ ఇస్తూ డెవిల్ సినిమా వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే అవుతుండడంతో మేకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నవంబర్ 24 నుంచి వాయిదా పడిన డెవిల్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ నుంచి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇప్పుడు డెవిల్ రిలీజ్ డేట్ ని పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఆదికేశవ’ సినిమా రిలీజ్ కానుంది.

Exit mobile version