NTV Telugu Site icon

Kalki 2989 AD: కల్కి దిగే టైం చెప్పేశారు.. ఇక రెడీ అవండమ్మా!

Kalki Relese Date

Kalki Relese Date

Kalki 2989 AD New Release Date: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న దాదాపు అన్ని సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే వాటిలో కల్కి 2898 సినిమా ప్రత్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుంది. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ఈ మే 9వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ మే 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో సినిమాని వాయిదా వేశారు. ఇప్పటి వరకు వాయిదా వేసిన విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ప్రమోషన్స్ ఇంకా ప్రారంభించకపోవడంతో వాయిదా వార్తలు నిజమే అని చెప్పవచ్చు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

Ramam Raghavam: ధనరాజ్ డైరెక్టర్గా “రామం రాఘవం”.. ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్

ముందుగానే ప్రకటించినట్టుగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కాకుండా కాస్త లేటుగా 5.27 నిముషాలకు కల్కి టీం నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. కల్కి టీం ప్రకటించిన దాని మేరకు ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వేసవి సెలవులు నేపథ్యంలో శుక్రవారం కాకుండా ఒకరోజు ముందుగానే గురువారం నాడు ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా అనేక మంది స్టార్ నటులు భాగమయ్యారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బహుభాషా చిత్రం ‘కల్కి 2898 AD’ మైథాలజీ ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ అని మేకర్స్ చెబుతున్నారు.