NTV Telugu Site icon

Kalki 2898 AD Censor Review: హాలీవుడ్ స్టాండర్డ్ విజువల్స్.. అబ్బురపరిచే అతిధి పాత్రలు..టీంకి సెన్సార్ సభ్యుల స్టాండింగ్ ఒవేషన్!

Kalki First Review Is Out

Kalki First Review Is Out

Kalki 2898 AD First Review is out: తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ఇండియా వైడ్ గా సినీ ప్రేమికులందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కల్కి సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ నిన్న పూర్తయింది. క్యూబ్ ఆఫీస్ లో సెన్సార్ సభ్యులు, సినిమా టీం ఈ సినిమాని చూసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సెన్సార్ టాక్ ఎలా ఉందనే విషయం మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా సెన్సార్ సభ్యులు ఈ సినిమాలో ఉన్న అద్భుతమైన విజువల్స్ చూసి ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తోంది.

హాలీవుడ్ స్టాండర్డ్స్ లో విజువల్స్ ఉన్నాయని భావించిన సెన్సార్ సభ్యులు నిలబడి సినిమా టీం కి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇండియన్ సినిమాలో ఇలాంటి విజువల్స్ గతంలో ఎప్పుడూ చూడలేదని వారు అభిప్రాయ పడినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా స్టోరీ లైన్ కూడా చాలా ఇంప్రెస్సివ్గా ఇంకా యూనిక్ గా ఉందని, అది కచ్చితంగా సినిమాని విజయ్ తీరాలకు నడిపిస్తుందని వారు అభిప్రాయపడినట్లుగా చెబుతున్నారు. ఇక నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా భైరవ అనే పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించాడని చెబుతున్నారు. సినిమా మొత్తం ఆయన పాత్ర ఆసక్తికరంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని వారు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.

ఇక అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ అలాగే కమల్ హాసన్ పాత్రలు కూడా చాలా బాగున్నాయని ఎలా అయితే వాళ్ళని లెజెండ్స్ అని మనం భావిస్తూ చూడాలని అనుకుంటామో అలాంటి పాత్రలలోనే అంతే అద్భుతమైన నటనతో మెరిసారని అంటున్నారు. ఇక సినిమాలో డ్రామా కూడా బాగా వర్కౌట్ అయిందని అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే బెటర్ గా ఉంటుందని అభిప్రాయపడినట్లుగా చెబుతున్నారు. అయితే సాంగ్స్ మాత్రం సరిగా సెట్ అవ్వలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సౌత్ ఇండియన్ అభిమానులందరూ అబ్బుర పడే విధంగా ఈ సినిమాలో అనుకోని అతిధి పాత్రలు ఉన్నాయని సినిమా ఎండింగ్లో ఉన్న ఒక అద్భుతమైన ట్విస్ట్ అయితే కచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని చెబుతున్నారు. రెండు గంటల 55 నిమిషాల నిడివి గల ఈ సినిమాకి యూఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది.