NTV Telugu Site icon

Kajal kartheeka : వణికించడానికి కాజల్ కార్తిక మీ ఇంటికే వచ్చేస్తోంది గెట్ రెడీ!

Kajal Kartheeeka

Kajal Kartheeeka

Kajal kartheeka to Stream in AHA: కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో జనని అయ్యర్, కలయరసన్, రైజా విల్సన్, పార్వతి తిరువొతు ఇతర పాత్రల్లో నటించిన సినిమా కాజల్ కార్తీక. డీకే రైటర్ గా డైరెక్టర్ గా పదార్తి పద్మజ నిర్మాతగా కాజల్ కార్తీక సినిమా తెరకెక్కింది. ఇక థ్రిల్లింగ్ హర్రర్ కాన్సెప్ట్ గా వస్తున్న ఈ సినిమాలో కాజల్ హారర్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. విగ్నేష్ వాసు డి ఓ పి వర్క్ మరియు ప్రసాద్. ఎస్. ఎన్. మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఏప్రిల్ 9న ఆహా ప్లాట్ ఫామ్ వేదికగా రిలీజ్ అవుతోంది. కామెడీ, హర్రర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. కామెడీ, హర్రర్ లవర్స్ ఏప్రిల్ 9న ఆహాలో ఈ సినిమా చూసేయచ్చు.

Vassishta: ధర్మ యుద్ధం మొదలు ఇక విశ్వంభర విజృంభణమే.. కాకరేపుతున్న డైరెక్టర్ పోస్ట్

ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా అనిపింస్తుంది. 5 వేర్వేరు కథలతో కాజల్ కి రెజీనాకి సంబంధం ఏంటి? ఊరు వాళ్ళందరూ కాజల్ని కొట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది? కామెడీతో సాగుతూనే హర్రర్ ఇంపాక్ట్ ని చాలా బాగా క్రియేట్ చేశారు. ట్రైలర్ చూస్తే సినిమాపై అంచనాలు పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఒక మంచి కామెడీ హర్రర్ ఫిలిం కోసం ఎదురుచూసే వాళ్ళకి ఏప్రిల్ 9న ‘కాజల్ కార్తీక’ హనుమాన్ మీడియా ద్వారా ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి అంటున్నారు మేకర్స్.