Site icon NTV Telugu

Vishvanth: ‘కథ వెనుక కథ’ విడుద‌ల వాయిదా!

Teravenuka

Teravenuka

Kadha Venuka Kadha: విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో సంస్థ దండమూడి బాక్సాఫీస్ బ్యానర్‌పై అవనీంద్ర కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 24న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు ‘క‌థ వెనుక క‌థ’ చిత్రం విడుద‌ల వాయిదా ప‌డింది. ఈ విషయాన్ని స‌హ నిర్మాత సాయి గొట్టిపాటి చెబుతూ, ‘‘మా క‌థ వెనుక క‌థ చిత్రాన్ని మార్చి 24న రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే కొన్ని అనివార్య కార‌ణాల‌తో సినిమా రిలీజ్‌ను వాయిదా వేశాం. త్వ‌ర‌లోనే మంచి రిలీజ్ డేట్ చూసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తాం’’ అన్నారు.

Exit mobile version