పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న హీరో జానీ డెప్. ఇక గత కొన్నిరోజుల నుంచి జానీ కోర్టులో తన మాజీ భార్యతో పోరాడుతున్నాడు. మాజీ భార్య రాసిన వ్యాసంపై రూ.380కోట్ల పరువు నష్టం దావా వేశాడు. అస్సలు విషయంలోకి వెళితే.. జానీ డెప్ మూడేళ్ల డేటింగ్ అనంతరం నటి అంబర్ హెర్డ్‌ను 2015లోరెండో వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన ఏడాదికే వారిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో ఈ జంట పెళ్లి మూడు నాళ్ళ ముచ్చటగా మారింది. రెండేళ్లకే వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడిపోయాక అంబర్ తానూ గృహహింస బాధితురాలినని తెలుపుతూ ఒక వ్యాసం రాసింది. అది కాస్తా వైరల్ కావడంతో ఆ వ్యాసాన్ని వ్యతిరేకిస్తూ జాన్ కోర్టు మెట్లెక్కాడు.
మాజీ భార్యపై రూ.380కోట్ల పరువు నష్టం దావా వేశాడు. ప్రస్తుతం ఈ కేసు వర్జీనియా కోర్టులో రెండో వారానికి చేరుకొంది. ఈసారి కోర్టులో జాన్ తన భార్య చేసిన ఆగడాలను ఏకరువు పెట్టాడు.. ” పెళ్ళైన ఏడాదికే మా ఇద్దరి మధ్య వాగ్వాదాలు మొదలయ్యాయి. ఆమె నను కొట్టేది.. అసభ్యమైన మాటలు మాట్లాడుతూ మానసిక వేదనకు గురిచేసేది. టీవీ రిమోట్, వైన్ గ్లాస్ తలపై విసురుతూ, రా ఇంట్లో ఇష్టానురీతిగా తనతో ప్రవర్తించేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా మానవ మలం బెడ్ పై ఉంచేదని, నన్ను దౌర్జన్యంగా, హింసాత్మకంగా అవమానించేదని వాపోయాడు. ప్రస్తుతం జాన్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే రెండో వారం కూడా కోర్టు ఈ కేసును వాయిదా వేసింది. తదుపరి విచారణ వచ్చే వారం జరగనుంది.
