Site icon NTV Telugu

జయసుధ షాకింగ్ మేకోవర్… పిక్ వైరల్

jayasudha

jayasudha

సీనియర్ నటి జయసుధ షాకింగ్ మేకోవర్ కన్పించడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ఆమె మేకోవర్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 62 ఏళ్ల సీనియర్ నటి జయసుధ తన కొత్త లుక్ లో పొట్టి హెయిర్ కట్ తో పాటు బాగా సన్నబడి మరింత యంగ్ గా కనిపించేలా మారిపోయింది. ఆమె ఆకర్షణీయమైన అవతార్ చూస్తుంటే జయసుధ ఎంత హెల్దీ డైట్ ను ఫాలో అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Read Also : చీప్ లిక్కర్ బ్రాండ్ కలుపుతూ కనిపించిన బుట్టబొమ్మ.. వరస్ట్ టేస్ట్ అంటున్న నెటిజన్స్

ఈ పిక్ లో జయసుధ బ్లేజర్, క్యాప్ ధరించి, ఆత్మవిశ్వాసంతో అందమైన చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది. జయసుధ కొత్త లుక్ కు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జయసుధ ప్రస్తుతం సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలు చేస్తోంది. ముఖ్యంగా ఈ తరం స్టార్ హీరోలకు తల్లి కావాలంటే జయసుధ బెస్ట్ ఆప్షన్ గా మారింది.

Exit mobile version