Site icon NTV Telugu

శ్రీకృష్ణాష్టమి స్పెషల్ గా “రాధేశ్యామ్” రొమాంటిక్ పిక్

Janmashtami Secial Poster from Radheshyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు లవ్ అంటే కొత్త అర్థం తెలపడానికొస్తున్న చిత్రం “రాధేశ్యామ్”. పూర్తిగా లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఒక దశాబ్దం తర్వాత ప్రభాస్ రొమాంటిక్ జోనర్‌కి తిరిగి వస్తున్నాడు. ఈ అద్భుతమైన ప్రేమ కథకు సంబంధించి “రాధే శ్యామ్” నిర్మాతలు ఈరోజు జన్మాష్టమి సందర్భంగా కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Read Also : తెలుగుతెరపై ‘శ్రీకృష్ణావతారం’

ప్రభాస్ పోస్టర్‌లో క్లాస్‌గా కనిపిస్తున్నాడు. పూజా హెగ్డే ఎప్పటిలాగే అద్భుతంగా కనిపిస్తుంది. బ్లూ డ్రెస్ పై నెమలి పింఛం అలంకరణతో కృష్ణాష్టమికి రిలేటెడ్ గా కన్పిస్తోంది. ఇక వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022 జనవరి 14న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక గతంలో ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రభాస్, పూజాహెగ్డే పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ ఈ సినిమా గురించి చాలాకాలం నుంచి ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభాస్ “సలార్”, “ఆదిపురుష్”, “ప్రాజెక్ట్ కే” వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూడు చిత్రాలు కూడా విభిన్నమైన జోనర్లో తెరకెక్కుతుండటం విశేషం.

Exit mobile version