బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పెద్ది సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంది. ఆ సినిమాలో తన పాత్రపై నెగిటివిటి రావడంతో ఇక చేయబోయే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమాలకు జాన్వీ సైన్ చేయలేదు. అయితే తన ఫోకస్ ను ఇప్పుడు కోలీవుడ్ పై పెట్టినట్టు కనిపిస్తోంది. వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విభిన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న జాన్వీ, తన తమిళ అరంగేట్రాన్ని ఓ భారీ ఓటీటీ ప్రాజెక్ట్ ద్వారా చేయబోతోంది. ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ద్వారా జాన్వీని కోలీవుడ్‌కి పరిచయం చేయబోతుంది.
ఈ వెబ్ సిరీస్‌కు ‘కురత్తి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను నిర్ణయించారు. వైవిధ్యమైన గ్రామీణ నేపథ్య చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శర్గుణమ్ ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. కబాలి, కాలా, సర్పట్ట వంటి సినిమాలతో గుర్తింపు పొందిన స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ ఈ ప్రాజెక్ట్‌కు ‘షోరన్నర్’గా వ్యవహరిస్తుండడం విశేషం. యదార్ధ సంఘనల ఆధారంగా రియాలికి దగ్గరగా, ఎమోషనల్ అండ్ డ్రామా ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్ రూపుదిద్దుకోనుందని సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ లో దేవర, పెద్ది సినిమాలతో అలరించిన జాన్వీ కపూర్ ఇప్పుడు పా. రంజిత్ నిర్మాణంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కొట్టాలని చూస్తోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ రీచ్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకునే కాంబినేషన్ కుదరడంతో ‘కురత్తి’ సిరీస్ జాన్వీ కెరీర్‌లో మరో కీలక మలుపుగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

