NTV Telugu Site icon

Kashmir: 30 ఏళ్ళ తరువాత కశ్మీర్ థియేటర్లో వేసిన మొట్ట మొదటి సినిమా ఏదంటే..?

Rrr

Rrr

Kashmir: ఒకప్పుడు నిత్యం ఉగ్రవాదం పేరుతో అట్టుడుకిపోయిన జమ్మూకశ్మీర్.. ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాగాలులను పీల్చుకొంటుంది. ఇక దీంతో కశ్మీర్ ప్రజలకు సరికొత్త వినోదాన్ని పంచడానికి మూసివేసిన థియేటర్లను తెరిపించింది ప్రభుత్వం.. ఆదివారం దక్షిణ కశ్మీర్లోని పుల్వామా శోపియాలలో మల్టీ పర్పస్ సినిమా హాళ్లను జమ్మకాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఇక మొదటి షోగా ఈ థియేటర్లో టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన ఆర్ఆర్ఆర్ సినిమాను వేశారు. ఇక మరో స్క్రీనింగ్ లో బాగ్ మిల్కా బాగ్ సినిమాను చూపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాను జమ్ముకశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు కొద్దిసేపు వీక్షించారు. అనంతరం ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమాను వీక్షిస్తూ చాలా ఏళ్ళ తరువాత సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇక కశ్మీర్ థియేటర్స్ గురించి చెప్పుకోవాలంటే.. 1980 లో కాశ్మీర్ లోనూ థియేటర్లు ఉండేవి.. కానీ, అప్పుడే ఉగ్రవాదులు థియేటర్లు ఓపెన్ చేస్తే చంపేస్తామని బెదిరించడంతో థియేటర్ల యజమానులు వాటిని మూసివేశారు. ఇక 30 ఏళ్ళ తరువాత ఈ సినిమా హాళ్లు ఓపెన్ అవ్వడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొనవచ్చు. అందులోనూ ఒక తెలుగు సినిమాను మొదటి సినిమాగా రిలీజ్ చేయడం విశేషమని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ రెండు థియేటర్లే కాకుండా మరిన్ని ఏరియాల్లో మరిన్ని థియేటర్లను ఓపెన్ చేయనున్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ హాళ్లను పుల్వామా శోపియా యువతకు అంకితం చేసినట్లు గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.