NTV Telugu Site icon

Rudrangi: ఈ టీజర్ ఏంటి ఇంత వయోలెంట్ గా ఉంది…

Rundrangi

Rundrangi

జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమల రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రుద్రంగి. ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రతిష్టాత్మకంగా రుద్రంగి సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్వతంత్రం తర్వాత ఆనాటి తెలంగాణ సాంఘిక పరిస్థితుల నేపథ్యం లో ఈ చిత్రం కనిపిస్తోంది. జగపతి బాబు భీం రావు దేశ్ ముఖ్ అనే క్రూరమైన దొర పాత్రలో కనిపిస్తున్నాడు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ రుద్రంగి సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే అన్ని పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆసక్తిని పెంచిన ఈ మూవీ టీజర్ విడుదలైంది.

Read Also: SSMB 28: ఓ త్రివిక్రమ్ మా అన్ననే వెయిట్ చేయిస్తావా?

రుద్రంగి… స్వతంత్రం తర్వాత ఆనాటి తెలంగాణ సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాగా కనిపిస్తోంది. స్వాతంత్రం మాకే కానీ బానిసలకు కాదు, వాడు బలవంతుడి కావొచ్చు కానీ నేను భగవంతుడిని అనే డైలాగ్స్ టీజర్ లో జగపతి బాబు చెప్తుంటే వయోలెంట్ గా అనిపించింది. జగపతి బాబు ఇప్పటివరకూ ఇలాంటి రోల్ ప్లే చెయ్యలేదు. మమతా మోహన్ దాస్ కూడా అందంగా కనిపిస్తూనే పవర్ ఫుల్ గా ఉంది. మల్లేష్ గా ఆశిష్ గాంధీకి మంచి పాత్ర వచ్చినట్టుగా ఉంది. ఘనవి లక్ష్మీ కూడా గ్రామీణ యువతిగా కనిపించి మెప్పించింది. ఓవరాల్ గా టీజర్ చూడగానే రుద్రంగి సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి మే నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ఎఇలన్తి రిజల్ట్ ని రాబడుతుందో చూడాలి.