Site icon NTV Telugu

విజయ్ ‘మాస్టర్’ నిర్మాత ఇంటిపై ఐటీ దాడులు

Vijay

తలపతి విజయ్ నటించిన ‘మాస్టర్స్’ నిర్మాత జేవియర్ బ్రిటో ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించడంతో ఇబ్బందుల్లో పడ్డాడు. చైనా మొబైల్ తయారీ కంపెనీలకు సంబంధించి జేవియర్ బ్రిటోకు చెందిన ఆదంబాక్కం ఇల్లు, అడయార్ కార్యాలయంపై దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొబైల్ కంపెనీతో జేవియర్ బ్రిట్టో ఎగుమతి, దిగుమతి సంబంధాలే ఈ ఐటీ సోదాలు ప్రధాన కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. ఇంతకుముందు ‘మాస్టర్’ సినిమా షూటింగ్ సమయంలో ఆదాయపు పన్ను శాఖ విజయ్‌ని ప్రశ్నించిందన్న విషయం తెలిసిందే. ‘బిగిల్’ సినిమా బాక్సాఫీస్ బిజినెస్‌కు సంబంధించి ఆయనను ఐటీ ఆరా తీసింది. అయితే 2020 ప్రారంభంలో జరిగిన విచారణ విజయ్ ‘బిగిల్’ బాక్సాఫీస్ కలెక్షన్‌ను ధృవీకరించింది.

Read Also :

https://ntvtelugu.com/siddharth-tweet-went-viral-on-social-media/

కాగా నెల్సన్ దిలీప్‌ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ ‘బీస్ట్‌’లో తలపతి విజయ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగి బాబు, షైన్ టామ్ చాకో తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ బ్యాంక్రోల్ చేసిన ‘బీస్ట్’ 2022లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

అలాగే ‘మాస్టర్’ నిర్మాత జేవియర్ బ్రిట్టో తన బావ, ప్రముఖ నటుడు అథర్వ సోదరుడు ఆకాష్‌ను XB ఫిల్మ్ క్రియేటర్స్ బ్యానర్‌లో లీడ్‌గా పరిచయం చేయనున్నారు. ఈ చిత్రానికి విష్ణు వరదన్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది.

Exit mobile version