Shamili: బాలనటిగానే భళా అనిపించిన షామిలి నాయికగా మాత్రం సక్సెస్ చూడలేక పోయింది. రెండేళ్ళ ప్రాయంలోనే మణిరత్నం ‘అంజలి’లో అద్భుతంగా నటించేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు సంపాదించింది. ఆ తరువాత అనేక తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ రూటులో సాగింది. ఆ రోజుల్లో అంతటి స్టార్ డమ్ చూసిన చైల్డ్ ఆర్టిస్ట్ మరొకరు లేరనే చెప్పాలి. హయ్యెస్ట్ పెయిడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గానూ అప్పట్లో చరిత్ర సృష్టించింది షామిలి. అలాంటి షామిలి హీరోయిన్ కావాలని కలలు కన్నది. కానీ, అవి కల్లలే అయ్యాయి. నాయికగా నటించిన నాలుగు చిత్రాల్లో రెండు తెలుగు సినిమాలు – “ఓయ్, అమ్మమ్మగారిల్లు” బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. తమిళ, మళయాళ చిత్రాల్లో నటించినా, అక్కడా అదే పరిస్థితి. దాంతో షామిలి అన్న రిచర్డ్స్, అక్క శాలిని, బావ అజిత్ “సినిమాలు నీకు అచ్చిరావు మానేయ్” అంటూ సలహా ఇచ్చారట. అయినా పట్టువీడని విక్రమార్కురాలుగా షామిలి సాగుతోంది. కొంపదీసి మళ్ళీ ముఖానికి రంగేసుకుంటావా? అంటే అదేమీ లేదు భయపడకండి అంటూ నవ్వేస్తోంది.
Shahrukh Khan: షారుఖ్ ఖాన్ ఆ విషయాలు తెలుసుకోవాలా!?
సినిమాల్లో హీరోయిన్ గా ఆకట్టుకోలేక పోయేసరికి చిత్రలేఖనంపై మనసు పారేసుకుంది షామిలి. ఆర్ట్ లో రాణిస్తూ సింగపూర్ లో సినిమా టెక్నాలజీలో మాస్టర్స్ చేస్తోంది షామిలి. ఇకపై నటిగా అయితే కనిపించను కానీ, సినిమా రంగంలో మాత్రం కొనసాగుతా అంటోంది. తనకు అన్నయ్య రిచర్డ్స్ ఎలాగో బావ అజిత్ కూడా వెల్ విషర్ అని చెబుతోంది. వారిద్దరి సూచనతో త్వరలోనే మళ్ళీ సినిమా రంగంలో అడుగుపెడతా అంటోంది. అసలే ఫిలిమ్ టెక్ కదా… మెగాఫోన్ పట్టేసి, బావనే హీరోగా పెట్టేసి డైరెక్షన్ లోకి దిగుతుందేమో? ఏమో, గుర్రం ఎగరావచ్చు. ఎక్కడ పారేసుకుంటామో అక్కడే వెదుక్కోవాలి అంటారు. షామిలి మనసు సినిమారంగంలోనే చిక్కుకుంది. కాబట్టి, చిత్రసీమలోనే ఈ చిన్నారి సాగనుందని తెలుస్తోంది.
