దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన మలయాళ చిత్రం ‘లోకా చాప్టర్ 1: చంద్ర’. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఓనం కనుకగా వచ్చిన ఈ సినిమా కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్ళను రాబడుతూ మలయాళ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మొదటి వారంలోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో చిత్ర విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.
Also Read : SuFromSo : సు ఫ్రమ్ సో.. 40 డేస్ కలెక్షన్స్.. ఎలా అండి ఇలా
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై మేము ఏడు సినిమాలు నిర్మించాము. కొత్త లోక కోసం ఇంత మంచి టీంతో పనిచేయడం సంతోషంగా ఉంది. నిర్మాతగా నేను వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. షూటింగ్ కి మహా అయితే ఒక్కసారి వెళ్ళి ఉంటాను. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి వల్లే ఈ కథ నా దగ్గరకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ తక్కువని మీరు అనుకోవచ్చు. కానీ, మలయాళ పరిశ్రమలో ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే నేను బడ్జెట్ ఇవన్నీ ఆలోచించలేదు. అందరూ తమ డ్రీమ్ లా ఈ సినిమా కోసం పని చేశారు. మేము ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయలేదు. డైరెక్టర్, డీఓపీ మధ్య బాండింగ్ బాగుంటే మంచి సినిమాలు వస్తాయని డొమినిక్ అరుణ్, నిమిష్ రవి నిజమని నిరూపించారు. మా సినిమాని తెలుగులో విడుదల చేసిన నాగవంశీకి కృతఙ్ఞతలు. కళ్యాణి ప్రియదర్శన్ నాకు చెల్లి లాంటిది. మేమిద్దరం ఒకేలా ఉంటాము, ఒకేలా ఆలోచిస్తాము. చంద్ర పాత్ర కోసం కళ్యాణి తప్ప మా మైండ్ లోకి వేరే ఎవరి పేరు రాలేదు. కొత్త లోక సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. నన్ను ఎలాగైతే మీ వాడిగా భావించారో, అలాగే కొత్త లోకను కూడా మీ సినిమాగా భావించి ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.” అన్నారు.
