Site icon NTV Telugu

Ileyana : తొమ్మిదో నెల గర్భంతో ఇబ్బంది పడుతున్న ఇలియానా..

Whatsapp Image 2023 07 09 At 12.09.11 Pm

Whatsapp Image 2023 07 09 At 12.09.11 Pm

హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మెప్పించిన ఇలియానా హిందీ సినిమాలలో కూడా మెరిసి అక్కడ కూడా మంచి విజయాలు సాధించింది. కానీ ఆ తరువాత ఇలియానా కెరీర్ కు ఇబ్బందులు వచ్చాయి ఒకప్పుడు వరుస అవకాశాలు అందుకున్న ఇలియానా ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇలియానా ఇటీవలే పెళ్లి కాకుండానే తల్లి అయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన బేబీ బంప్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం హీరోయిన్ ఇలియానాకు తొమ్మిదో నెల అని తెలుస్తుంది.నిండు గర్భవతిగా తనకు ఎదురవుతున్న ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా ఆమె తెలియజేశారు. తన బిడ్డకు తండ్రిని చూపిస్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇలియానా కానీ అతని ఫేస్ ను మాత్రం కనిపించకుండా కవర్ చేసింది.. తన బాయ్ ఫ్రెండ్ పేరును ఇప్పటికీ వెల్లడించలేదు ఇలియానా.

ఇలియానా ఇటీవల ఆ వ్యక్తి గురించి చెబుతూ తల్లి కావడం ఎంతో గొప్ప విషయమని నా శరీరంలో ఓ ప్రాణికి జీవం పోయడం నాకు గొప్ప అనుభూతిని పంచిందని తెలిపింది.. అలాగే తనకు కష్టనష్టాల్లో ఒక వ్యక్తి తోడున్నాడని ఆ వ్యక్తి తనని భాధ నుండి బయటపడేలా చేశాడని ఇలియానా తెలిపింది. నా జీవితానికి తోడుగా నిలిచాడని ఇలియానా అన్నారు. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం ఇలియానా చెప్పలేదు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా చెప్పుకొచ్చింది ఇలియానా.తాజాగా ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. తొమ్మిదో నెల కాడంతో ఏ పనులు కూడా చేయలేకపోతున్నాను. ఎంతో నీరసంగా ఉంది అంటూ ఆమె కామెంట్ పెట్టారు.నెలలు నిండాక నడవడం కూడా ఎంతో కష్టంగా ఉంది.. అందుకే మాతృత్వం ఎంతో గొప్పది అని ఆమె కామెంట్ చేసింది.త్వరలోనే ఇలియానా ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది.

Exit mobile version