తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు నాగ చైతన్యతో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాను తీయబోతున్నాడు. నాగచైతన్య తమిళంలో చేయబోతున్న డైరెక్ట్ సినిమా ఇదే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 23న ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకు ఇళయరాజా ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించబోతున్నట్లు సమాచారం.
జూన్ 12న చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ మూవీలో అరుణ్ విజయ్ విలన్ గా నటించబోతున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య నటించిన ‘థ్యాంక్యూ’ త్వరలో విడుదల కానుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో నాగార్జున నటించిన ‘సంకీర్తన, ఆఖరి పోరాటం, గీతాంజలి, శివ, నిర్ణయం, చైతన్య, కిల్లర్’ వంటి సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించాడు. ఇప్పుడు నాగ్ తనయుడు నాగచైతన్యతో ఇళయరాజా, ఆయన కుమారుడు కలసి పని చేస్తుండటం విశేషం.
