I Bomma:సినీ అభిమానులకు ఐ బొమ్మ షాక్ ఇచ్చింది. గత కొన్నిరోజుల నుంచి ఐ బొమ్మ అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. అసలు ఏంటి.. ఈ ఐ బొమ్మ అని అంటే.. సినిమా ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి చూడలేనివారు, ఓటిటీ యాప్స్ కు డబ్బులు పెట్టి కొనలేనివారు.. ఈ ఐ బొమ్మ సైట్ లో ఫ్రీగా సినిమాలు చూడొచ్చు. హై క్వాలిటీతో కొత్త కొత్త సినిమాలను ఐ బొమ్మ లో ఫ్రీగా చూడడానికి వీలు అవుతోంది. దీంతో ఐ బొమ్మ కు కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ సైట్ కొనసాగుతోంది. తమిళ్ రాకర్స్ లాంటి థియేటర్ ప్రింట్స్ కాకుండా హై క్వాలిటీతో సినిమాలను ఫ్రీగా చూపిస్తున్న ఈ సైట్ పై ప్రేక్షకులు అభిమానాన్ని పెంచుకున్నారు. ఇక అలాంటి ఐ బొమ్మ గత కొన్నిరోజుల క్రితం తమ సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇక దీంతో ఐ బొమ్మ ఫ్యాన్స్ అందరూ.. నువ్వు లేకపోతే మేము ఏమైపోతాం అంటూ వారికి మెయిల్స్ పంపించగా.. కొన్ని కండిషన్స్ తో ఐ బొమ్మ తిరిగివచ్చింది. కేవలం మొదటి 30 సినిమాలు మాత్రమే ఓపెన్ అయ్యేలా సైట్ ను డిజైన్ చేశారు. సరే గుడ్డిలో మెల్ల అన్నట్లు అభిమానులు కూడా అందుకు ఒప్పుకున్నారు. ఇక వారందరి ఆశలను కూలుస్తూ మరోసారి ఐ బొమ్మ గట్టి షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఎటువంటి సేవలు తమవద్ద నుంచి రావాన్ని ఖరాకండీ గా చెప్పుకొచ్చేసింది. సెప్టెంబర్ 9 నుచ్న్హి ఐ బొమ్మ షట్ డౌన్ అవుతుందని, దయచేసి తమకు మెయిల్స్ పెట్టవద్దని కోరింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరోసారి తిరిగి రాబోయే ఆలోచన కూడా లేదని చెప్పిన ఐ బొమ్మ ఇప్పటివరకు తమపై చూపిన ప్రేమాభిమానాలకు థాంక్స్ చెప్పింది. ఇక ఈ వార్త తెలియడంతో సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
