NTV Telugu Site icon

Rana: 20 నిముషాలు టైం ఇస్తే ఎన్టీఆర్ చైనీస్ భాష కూడా మాట్లాడగలడు

Rana

Rana

మార్చ్ 10న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కానుంది ‘రానా నాయుడు’. దగ్గుబాటి అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ లో వెంకటేష్, రానా కలిసి నటించారు. రానా నాయుడు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రానా ఒక ఇంటర్వ్యూలో మన హీరోల గురించి మాట్లాడాడు. చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ ల నుంచి ఏదైనా దొంగతనం చెయ్యాలి అంటే ఏం తీసుకుంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి రానా… “చరణ్ కి ఏదైనా ఇచ్చేస్తాను, తీసుకోను. ప్రభాస్ దగ్గర చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది కాబట్టి అతని చెఫ్ ని దొంగతనం చేస్తాను. అల్లు అర్జున్ నుంచి అయితే దొంగతనం చెయ్యను… మేమిద్దరం కలిసి ఇంకొకరి దగ్గర నుంచి దొంగతనం చేస్తాం. ఇక ఎన్టీఆర్ నుంచి ఏదైనా దొంగతనం చెయ్యాలి అంటే అతని లింగ్విస్టిక్ స్కిల్స్ ని దొంగతనం చేస్తాను. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు ఇంకో అయిదు ఇండియన్ భాషలని ఎన్టీఆర్ మాట్లాడుతాడు. ఒక 20 నిముషాలు టైం ఇస్తే, కాసేపు వింటే చాలు ఎన్టీఆర్ ఏ భాష అయినా అనర్గళంగా మాట్లాడుతాడు. చైనీస్ భాషని కూడా కాస్త టైం ఇస్తే ఎన్టీఆర్ మాట్లాడేస్తాడు” అని చెప్పాడు. రానా మాటలని ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది రా మా అన్న గొప్పదనం అంటూ నందమూరి అభిమానులు ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ సమయంలో కూడా జపనీస్, ఫారిన్ ఇంగ్లీష్, కన్నడ, హిందీ, తమిళ్ భాషలని ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడిన వీడియోస్ బాగానే వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని గెలుస్తుందని తాను ముందే నమ్మానని, రాజమౌళి తన క్రాఫ్ట్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. మార్చ్ 12న నాటు నాటు సాంగ్ ని ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ ని తెస్తుంది అని చెప్పాడు. రానా మాటలు నిజమైతే, ఆ గోల్డెన్ మూమెంట్ ని మన హిస్టరీలో ఎప్పటికీ గుర్తుండేలా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే.

Read Also: Sarpatta: ఒటీటీలో రిలీజ్ అయిన సినిమాకి థియేట్రికల్ సీక్వెల్…

Show comments