NTV Telugu Site icon

Film Chamber: హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో అగ్నిప్రమాదం

Firee

Firee

Huge Fire Accident at Hyderabad Film Chamber: హైదరాబాద్లోని ఫిలింనగర్ లో ఉన్న తెలుగు ఫిలిం ఛాంబర్ లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఫిలింనగర్ నడి మధ్యలో ఉండే ఫిలిం ఛాంబర్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వంటి ఇతర కార్యాలయాలు కూడా ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతల మీటింగ్స్, ఇతర కార్యక్రమాలు అక్కడి నుంచే జరుగుతూ ఉంటాయి. అయితే అక్కడ పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్న క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు అక్కడి సిబ్బంది.

Tapsee: తాప్సి పెళ్లి వీడియో లీక్.. చూశారా?

వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా హైదరాబాదులోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా మంటలు పుట్టించే విధంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇక భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో చాలా చోట్ల ఇలా అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తుంది. కరెంటు వైర్లు అంటుకొని నిప్పు పుట్టడంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండడంతో మంటలు బాగా వ్యాపించాయని చెబుతున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోంది.

Show comments