NTV Telugu Site icon

HouseOfManchus: ఛీఛీ.. దానికోసం మంచు కుటుంబం ఇంతకు దిగజారతారా..?

Manoj

Manoj

HouseOfManchus: సాధారణంగా సినిమాల్లో ట్విస్టులు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. మొదటి నుంచి ఒక కథను చూపించి మధ్యలో అదంతా తూచ్.. అది కల అని చూపించేస్తారు. దాంతో చూసే జనాలు పిచ్చివాళ్ళు అవుతారు. ప్రస్తుతం మంచు కుటుంబం.. జనాలను పిచ్చివాళ్లను చేయడానికి రెడీ అయ్యింది. మంచు మోహన్ బాబుకు.. ఇద్దరు భార్యలు.. ముగ్గురు పిల్లలు. మొదటి భార్య పిల్లలు మంచు లక్ష్మి, మంచు విష్ణు. రెండో భార్య కొడుకు మంచు మనోజ్. ఇక్కడివరకు అందరికి తెల్సిందే. చిన్నతనం నుంచి ఎలాంటి విబేధాలు లేకుండా ఈ ముగ్గురు పిల్లలు కలిసి మెలిసి పెరిగారు.. సెటిల్ అయ్యారు. ఎప్పుడైతే వీరికి పెళ్లిళ్లు అయ్యాయో.. నిదానంగా వీరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. అన్నదమ్ముల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఇక మంచు మనోజ్ రెండో పెళ్లి మరింత ఆజ్యం పోసింది. ఎప్పటి నుంచో లోపల లోపల రగులుతున్న ఈ వివాదం.. మొన్న బయటకి వచ్చింది.

Geetha Arts: బెస్ట్ ‘డ్యాన్సర్’ అల్లు అర్జున్ కాదు హృతిక్ రోషన్..?

మనోజ్ బంధువుల ఇంటిపై విష్ణు దాడి చేయడం, మనోజ్ ఆ వీడియోను షేర్ చేస్తూ ఇలా ఇంటిమీద పడి మా అన్న దౌర్జన్యం చేస్తున్నాడు అని మనోజ్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ తరువాత వీడియో డిలీట్ చేసిన మనోజ్.. దాని గురించి మాట్లాడలేదు.. ఇంకోపక్క విష్ణు.. తమ్ముడు కొంచెం ఆవేశపరుడు.. అదేదో చిన్నగొడవ అని కవర్ చేశాడు. మోహన్ బాబు అయితే.. అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవా..? కోపం తగ్గించుకుంటే వాళ్ళే బావుంటారు అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ గొడవ జరిగి వారం దాటింది. అంతా ఈ గొడవను మర్చిపోయారు అనుకున్న సమయంలో మంచు కుటుంబం పెద్ద షాక్.. కాదు.. కాదు సినిమాలో కూడా ఇవ్వని ట్విస్ట్ ఇచ్చారు. ఆ గొడవ అంతా ప్రాంక్ అని బాంబ్ పేల్చారు. దిమ్మ తిరిగిపోయింది కదా.. ఇదంతా ఒక రియాలిటీ షో కోసం షాక్ ఇచ్చారు. అమెరికన్ మోడల్.. కిమ్ కార్ధాషియన్ నిర్వహించిన ది కార్ధాషియన్ షో లా.. ది హౌస్ ఆఫ్ మంచుస్ అనే పేరుతో ఈ కుటుంబం రియాలిటీ షో చేస్తుందట. ఈ షో ప్రమోషన్స్ కోసమే ఈ గొడవ.. అంతకుముందు జరిగిన గొడవలు అన్ని జరిగినవి అని చెప్పుకొచ్చారు.

Hey Ram: ‘ఆదిపురుష్’ కొత్త పోస్టర్ కూ తప్పని ట్రోలింగ్!

హౌస్ ఆఫ్ మంచుస్ ప్రోమో ను మంచు విష్ణు రిలీజ్ చేస్తూ.. ఇది కేవలం మొదలు మాత్రమే అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ వీడియోలో అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదాలు.. దానికి ఇంట్లో ఎవరెవరు ఎలా స్పందించారు. బయట వారు ఏమనుకున్నారు.. వీరు ఎలా ఫీల్ అయ్యారు..? అన్ని చెప్తారు అంట. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పదింస్తున్నారు. చాలు.. చాలా బాగా కవర్ చేశారు అని కొందరు. అందుకే మీ మంచు కుటుంబం మాట ఎవరు నమ్మరు అని ఇంకొందరు చెప్తుండగా.. ఛీఛీ డబ్బు కోసం.. పేరు కోసం.. మీరు ఇంతకు దిగజారతారు అని అనుకోలేదు అని చెప్పుకొస్తున్నారు.

Show comments