NTV Telugu Site icon

Hit List: హీరోగా తమిళ డైరెక్టర్ కొడుకు.. హిట్ లిస్ట్ అంటూ వచ్చేస్తున్నాడు!

Hit List Trailer

Hit List Trailer

Hit List Movie Trailer Released: తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలలో నటించిన సినిమా హిట్ లిస్ట్. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పైన అంచనాలను పెంచగా ఈ సినిమా టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి.

Indian 2 : గ్రాండ్ గా ఆడియో లాంచ్..వైరల్ అవుతున్న గెస్ట్ లిస్ట్..

ఇక ఈ క్రమంలో హీరో విజయ్ కనిష్క మాట్లాడుతూ నాకు తెలుగు సరిగ్గా రాదు అయినా కూడా తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం, మా అమ్మ తెలుగు, నాన్న తమిళ్ సో రెండు నాకు చాలా ఇష్టం. హిట్ లిస్ట్ మూవీ కథ నాకు బాగా నచ్చింది. నా దర్శకులు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ నాకు చాలా కంఫర్ట్ ఇచ్చి ఈ సినిమా చేయించారు. మా నాన్న తమిళ్, తెలుగులో పెద్ద సినిమాలు తీసిన డైరెక్టర్ విక్రమన్. తెలుగులో మా నాన్న మొదటగా తీసిన సినిమా వసంతం. వెంకటేష్ తో మొదటి సినిమా అయినా ఆయనకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. నాకు కూడా ఈ సినిమాకి అదే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, ఈ సినిమా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

Show comments