నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే కానుకగా 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమా రెట్రోతో పోటీని ఎదుర్కున్న హిట్ 3 తోలి ఆట నుండే హిట్ టాక్ అందుకుంది. హింసపాళ్ళు కాస్త ఎక్కువయ్యాయని కంప్లైంట్ ఉన్నకలెక్షన్స్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు.
Also Read : OTT : ప్రదీప్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్
అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపించిన హిట్ 3 మొదటి రోజు అంతే జోష్ చూపించింది. హిట్ 3 మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 43 కోట్లు రాబట్టినట్టు అధికారకంగా ప్రకటించారు. ఈవిషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాగా హిట్ 3 సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ తో పాటు మరో రికార్డ్ ను కూడా సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్. ప్రస్తుతం ఉన్న టైర్ 2 హీరోలలో డే 1 అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. రేపు, ఎల్లుండి లాంగ్ వీకెండ్ ఉండడం హిట్ 3 కి కలిసొచ్చే అంశం. ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా వంద కోట్ల క్లబ్ క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అటు ఓవర్సీస్ లోను హిట్ 3 భారీ వసూళ్లు దిశగా సాగుతోంది.
