NTV Telugu Site icon

Telugu Film Industry : సమస్యల కోసం హై లెవల్ సబ్ కమిటీ

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ – 24 క్రాఫ్ట్స్ మరియు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కలసి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలను చర్చించటానికి ఇటీవల జి. ఆదిశేషగిరి రావుఅధ్యక్షతన సమావేశమైంది. చిత్ర పరిశ్రమలోని వివధ శాఖలకు చెందిన సభ్యులు ఇందులో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలలోని అడ్మిషన్ రేట్స్ పై ఇచ్చిన జి.ఓ.లు ఎలా అమలుపరచాలి, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ నియమ నిబంధనలు, ఫిలిం ట్రైలర్స్ , పబ్లిసిటీ ఖర్చులు, ఆన్లైన్ టిక్కెటింగ్ సంస్థలు, వారి విధి విధానాలు, పర్సెంటేజ్ విధానం, ఓటిటి వంటి పలు విషయాలపై అందరూ ఏకాభిప్రాయంతో సానుకూలంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. చిన్న సినిమాల మనుగడ కోసం చిత్త శుద్ధితో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం ఫిలిం ఛాంబర్ హై లెవెల్ సబ్ కమిటీ నియమించి అన్ని అంశాలను చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఛాంబర్ అధ్యక్షులు నారాయణ్ దాస్ కిషన్ దాస్ నారంగ్, కార్యదర్శులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, యం. రమేష్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.