Site icon NTV Telugu

Vamsi Nandipati : నంది అవార్డుల వివాదంపై స్పందించిన వంశీ నందిపాటి!

Vamsi Nandipati

Vamsi Nandipati

సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘హే బల్‌వంత్‌’. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ శుక్రవారం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దూసుకపోతుంది.ఈ నేపథ్యంలో చిత్ర బృందం తొలిసారిగా, వినూత్నంగా థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్బంగా వంశీ నందిపాటి మాట్లాడుతూ ” ఈ సినిమాకు బ్రేక్‌ ఈవెన్‌ కావడం నాకు ఎంతో హ్యపీనెస్‌ ఇచ్చే విషయం.

ALso Read:Peddi Second Single: పెద్ది సెకండ్ సింగిల్ ఆ రోజే దించుతున్నారు

చాలా తక్కువ మంది మాత్రమే మా సినిమాకు బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని దైర్యంగా చెబుతారు, అలాంటి కోవలోకి మా హే బల్‌వంత్‌ నిలిచినందుకు ఆనందంగా ఉంది. నిర్మాత నిలబడితే ఎన్నో మంచి సినిమాలు వస్తాయి. ప్రొడ్యూసర్‌ మనీ రికవరీ అయితేనే ఆ సినిమా సక్సెస్‌ఫుల్‌ సినిమాగా నిలుస్తుంది అన్నారు. మొన్న ఒక ఈవెంట్‌లో చిన్నగా మాట దొర్లాను. అది నా స్టేట్‌మెంట్‌ కాదు. తప్పుగా వెళ్లింది. ఎవరో 12 సంవత్సరాల క్రితం ఎవరో అన్న స్టేట్‌మెంట్‌ను గుర్తు చేశాను. అప్పట్లో ఇలా అనేవారు అన్నారు. నాకు దేవుడి మీద , అవార్డ్స్‌ మీద అపారమైన గౌరవం వుంది. దేవుడు అంటే ఎంతో భక్తి ఉందో, అవార్డ్స్‌ మీద కూడా గౌరవం ఉంది. నాకు చిన్నప్పటి నుండి నంది అవార్డ్స్‌ లాంటి అవార్డు అందుకోవాలని ఆశగా ఉండేది. ఆ కలతోనే సినీ పరిశ్రమకు వచ్చాను. ఇలాంటి గొప్ప అవార్డ్స్‌ గురించి నేను తప్పుగా మాట్లాడను. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉండే ఐయామ్‌ రియల్లీ సారీ’ అన్నారు.

Exit mobile version