NTV Telugu Site icon

Naveen Polishetty: జవాన్ తో రిలీజ్ అంటే నిద్రకూడా పట్టలేదు.. కానీ అద్భుతం జరిగింది: పోలిశెట్టి

Miss Shetty Mister Polishetty (10)

Miss Shetty Mister Polishetty (10)

Hero Naveen Polishetty Intresting Comments on Miss Shetty Mr. Polishetty Sucess: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాల ఘన విజయం తర్వాత…‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో హ్యాట్రిక్ సూపర్ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి మీడియాతో మాట్లాడారు. అనుష్క శెట్టితో కలిసి నవీన్ నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కుడా మంచి వసూళ్లు సాధించింది. థర్డ్ వీక్ లోనూ గ్లోబల్ గా స్టడీ కలెక్షన్స్ తో ప్రదర్శితమవుతోన్న ఈ సినిమాకి ఆడియన్స్ లవ్ తో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా అప్రిసియేషన్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలో నవీన్ మాట్లాడుతూ మేము సెప్టెంబర్ 7 అనే డేట్ అనౌన్స్ చేయగానే మరోవైపు జవాన్ రిలీజ్ డేట్ ప్రకటించారని అప్పుడు ఎంతో టెన్షన్ పడ్డానని అన్నారు. పెద్ద సినిమాతో వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుందో అనే కంగారు ఉండేది ఎందుకంటే మేము మంచి సినిమా చేశాం ప్రేక్షకులకు నచ్చుతుందని తెలుసు. కానీ సోలో గా వస్తే బాగుండేది కదా అనిపించింది కానీ ప్రేక్షకులు మా సినిమాను సూపర్ హిట్ చేశారని ఆయన అన్నారు. మంచి సినిమా అనే వర్డ్ ఆఫ్ మౌత్ తోనే అందరికీ రీచ్ అయ్యేలా చేశారని పేర్కొన్న ఆయన ఫస్ట్ తెలుగులో కలెక్షన్స్ నెమ్మదిగా మొదలయ్యాయి.

Rakshit Shetty: రష్మికను రక్షిత్ ఇంకా మరచిపోలేదా.. టచ్ లోనే ఉన్నాడట!

కానీ యూఎస్ లో డల్లాస్ లో ప్రీమియర్స్ వేసినప్పటి నుంచే స్ట్రాంగ్ గా రన్ స్టార్ట్ అయ్యింది అందుకే మూడు రోజులకే వన్ మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు థర్డ్ వీక్ లో కూడా యూఎస్ లో రన్ అవుతోంది, స్క్రీన్స్ పెంచుతున్నారు. వాస్తవంగా మూడో వారంలో యూఎస్ లో సినిమా ఉండదు అలాగే యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లో కూడా ఆడియన్స్ డిమాండ్ మేరకు షోస్ పెంచుతున్నారని ఆయన అన్నారు. నేను యూఎస్ నుంచి వచ్చాక కూకట్ పల్లి , చుట్టు పక్కల ఏరియాస్ థియేటర్స్ చూశా, థర్డ్ వీక్ లో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. మేము చేసిన మంచి ప్రయత్నాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని ఆయన అన్నారు. మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్టార్ హీరోస్, టెక్నీషియన్స్ వాలెంటరీగా రియాక్ట్ అయ్యారు. ఆడియెన్స్ కూడా వాళ్లకు వాళ్లే ముందుకొచ్చి మా సినిమాను ప్రమోట్ చేశారు, ప్రమోషన్ టూర్ కోసం గత 25 రోజుల్లో 75 సిటీస్ వెళ్లానని ఆయన అన్నారు. అమెరికాలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు జర్నీ చేసే ఫ్లైట్ లోనే నిద్రపోయేవాడినని, హోటల్ లో నిద్ర పోయేందుకు కూడా టైమ్ ఉండేది కాదని అన్నారు. రిలీజ్ అయ్యాక కూడా మూవీ ప్రమోషన్ చేశాం, అది నా థ్యాంక్స్ చెప్పుకోవాడనికి వెళ్తున్నా కాబట్టి అది కష్టం అనిపించలేదని ఆయన అన్నారు.

Show comments