Site icon NTV Telugu

Nara Rohit Birthday: హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు

Nara

Nara

Hero Nara Rohit’s birthday celebrations

జూలై 25 హీరో నారా రోహిత్ జన్మదినం. ఈ సందర్భంగా బంధు మిత్రులతో పాటు సన్నిహితులు అభిమానులు ఆనందంగా బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. రెండు తెలుగు రాష్టాల అభిమానులు ఉదయం నుండి దేవాలయాలలో నారా రోహిత్ పేరు మీద ప్రత్యేక పూజలు, అలాగే అనాధ శరణాలయాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు హీరో నారా రోహిత్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రంలో ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ‘ హీరో ఉదయ్ శంకర్, నిర్మాత అట్లూరి నారాయణరావు , నారా రోహిత్ స్నేహితుడు తాడికొండ సాయి కృష్ణ, రోహిత్ అభిమాన సంఘ నాయకులు వీరపనేని శివ చైతన్య, రాజా నరేంద్ర, గుంటూరు శివ, గాలి సృజన తదితరులు పాల్గొని నారా రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version