NTV Telugu Site icon

టైటిల్ పోస్టర్ : తమిళ స్టార్ తో సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ

Here’s the Title Poster of Sundeep Kishan29 - MICHAEL

ప్రఖ్యాత కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాలో స్క్రీన్ షేర్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మల్టీస్టారర్ ను సమర్పిస్తున్న ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. “మైఖేల్‌” అనే టైటిల్ ను రివీల్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో సందీప్ చేతికి సంకెళ్లు ఉన్నాయి. ఆయన మరో చేతిలో ఇత్తడి వస్తువును పట్టుకుని పిడికిలిని బిగించాడు. చొక్కా, చేతులకు రక్తం ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది.

Read Also : దసరా బరిలో “మహాసముద్రం”

మైఖేల్ రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైఖేల్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో విడుదల కానుంది.

Show comments