NTV Telugu Site icon

Thandel : ఈ సినిమా కోసం ఆయనలో ఓ ఆకలి కనిపించింది : సాయి పల్లవి

Thandel (4)

Thandel (4)

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు ‘తండేల్’ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

Also Read : Thandel : వాళ్లిదరు లేకుండా నెక్ట్స్ సినిమా చేయలేనేమో అని భయం పట్టుకుంది : నాగ చైతన్య

హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ’ అందరికీ నమస్కారం. దేవిశ్రీ ప్రసాద్ అద్భతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన డ్యాన్స్ చేస్తూనే సాంగ్స్ కంపోజ్ చేస్తారు. అందుకే పాటల్లో అంత ఎనర్జీ వుంటుంది. ఇందులో బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. శ్యాం దత్ విజువల్స్ ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. నాగేంద్ర ప్రతి సెట్ కి లైఫ్ తీసుకొచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. అల్లు అరవింద్ నాకు తండ్రిలాంటి వారు. బన్నీవాసు గారు చాలా పాషన్ తో సినిమాని చేశారు. వారి నిర్మాణంలో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. సందీప్ రెడ్డి వంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు. ఫిలిం మేకర్ కి ఆ వాయిస్ వుండాలి. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. నాగ చైతన్య ఈ సినిమా కోసం చాలా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ఈ సినిమా కోసం ఆయనలో ఓ ఆకలి కనిపించింది. చాలా హార్డ్ వర్క్ చేశారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన అందరికీ థాంక్ యూ. మేము మీ సినిమానే తీశాం. చాలా మంచి సినిమా ఇది. మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను’ అన్నారు.