Site icon NTV Telugu

Polishetty: హతవిధీ… వాట్ ఏ డ్యామేజీ…

Polishetty

Polishetty

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో యూత్ ని జానేజిగర్ గా మారిపోయాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో, లేడీ సూపర్ స్టార్ గా పేరున్న స్వీట్ బ్యూటీ అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తున్నారు. ఒక కొత్త బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ ఫీల్ గుడ్ సినిమాని పి.మహేష్‌ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమా నుంచి ఒక క్యాచీ బ్రేకప్ సాంగ్ ని రిలీజ్ చేసారు. బ్రేకప్ సాంగ్ అనగానే యూత్ అందరికీ ‘వై దిస్ కొలవెరి’, ‘నా మది’ లాంటి ధనుష్ సాంగ్స్ గుర్తొస్తాయి. ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే హార్ట్ టచింగ్ గా ఉండాలి, వినగానే ఏడిపించేయాలి అనేలా ఉండేవి.

అలాంటి పాటలని ధనుష్ చాలా క్యాజువల్ గా, అందరూ పాడుకునే అంత క్యాచీగా మార్చేశాడు. అందుకే ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలోని లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కోసం ధనుష్ నే రంగంలోకి దించారు. ”హతవిధీ ఏందిదీ.. ఊహలో లేనిదీ.. బుల్లిచీమ బతుకుపై బుల్డోజరైనదీ..” అంటూ సాగే ఈ పాట వినగానే పాడుకునేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ చాలా క్యాచీగా, ప్రతిఒక్కరూ హమ్ చేసేలా ఉన్నాయి. ధనుష్ వాయిస్ లోని మ్యాజిక్, ఈ హతవిధీ సాంగ్ ని మరింత స్పెషల్ గా మార్చింది. లిరికల్ వీడియోలో నవీన్ పోలిశెట్టి లుక్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. ఈ సాంగ్ ఇంకొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం గ్యారెంటీ.

Exit mobile version