Site icon NTV Telugu

Harsha Sai: ఫేమస్ యూట్యూబర్ హర్షసాయి హీరోగా ఎంట్రీ.. నిర్మాతలు ఎవరో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

Harsha Sai Pan India Movie

Harsha Sai Pan India Movie

Harsha Sai Pan india Movie Teaser to release on 17th September: యూట్యూబ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు యూట్యూబర్ లలో హర్ష సాయి ఒకరు. ఎక్స్పరిమెంటల్ వీడియోలు చేస్తూ పేదలకు సహాయం చేస్తున్నట్లుగా ఉండే వీడియోలు చేసే ఆయనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఆ ఫాలోయింగ్ చూసి ఆయన పాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఆయన వీడియోలో రావడం తగ్గాయి. ఈ సమయంలోనే ఆయన ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని ప్రచారం ఊపందుకుంది. అయితే తాజాగా హర్ష సాయి సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈ నెల 17వ తేదీన జరగబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా టీజర్ అనౌన్స్మెంట్ కి సంబంధించిన పోస్టర్లో వందల మంది ఒక పెద్ద గంట చుట్టూ చేరి చూస్తున్నట్లుగా పోస్టర్ క్రియేట్ చేశారు.

WhatsApp Channels: దిమ్మతిరిగే ఫీచర్‌ తెచ్చిన వాట్సాప్‌.. 150 దేశాల సెలబ్రిటీలతో నేరుగా?

ఇక ఈ సినిమా నిర్మాతల విషయానికి వస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు ఈ సినిమాని సమర్పిస్తుండగా గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సందడి చేసి కొన్నాళ్లలోనే హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయిన మిత్ర శర్మ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆమెకు సంబంధించిన శ్రీ పిక్చర్స్ అనే బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కి నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో అంటే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఫిలింనగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ టీజర్ లాంచ్ జరగబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మిత్ర శర్మ తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్టర్ షేర్ చేశారు.

Exit mobile version