NTV Telugu Site icon

Harish Shankar: ఛోటా కే నాయుడికి హరీష్ శంకర్ బహిరంగ లేఖ.. మళ్ళీ కెలికితే అంటూ!

Harish Shankar Vs Chota K Naidu

Harish Shankar Vs Chota K Naidu

Harish Shankar Open Letter to Chota K Naidu: తన గురించి స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు చేసిన కొన్ని కామెంట్ల మీద హరీష్ శంకర్ ఒక బహిరంగ లేఖ రాశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామయ్యా వస్తావయ్యా సినిమా విషయంలో హరీష్ శంకర్ గురించి చోటా కే నాయుడు మాట్లాడారు. తాను చెప్పిన మాటలు వినలేదని అర్ధం వచ్చేలా ఆయన కామెంట్ చేయగా దానికి హరీష్ శంకర్ కాస్త ఘాటుగానే లేఖ రాశారు.

Bhaje Vaayu Vegam: ఆసక్తి రేకెత్తించే “భజే వాయు వేగం” టీజర్

హరీష్ శంకర్ రాసిన లేఖ యధాతదంగా
(వయసులో పెద్ద కాబట్టి ) గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ…. రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది కానీ రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్ ని తీసేస్తున్నాడు……. అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే “గబ్బర్ సింగ్” వచ్చినప్పుడు నాది “రామయ్య వస్తావయ్య” వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా, నేను మౌనంగానే బాధపడ్డా, కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే any day any platform I AM WAITING ఇట్లు భవదీయుడు హరీష్ శంకర్ అంటూ ఆయన రాసుకొచ్చారు.